`బాహుబలి` స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు యాక్షన్ ఎంటర్‌టైనర్ `సాహో` చేస్తూనే… మరో వైపు పేరు నిర్ణయించని రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను చేస్తున్నాడు. కాగా… సుజీత్ దర్శకత్వంలో భారీ తారాగణంతో రూపొందుతున్న `సాహో` చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సింహభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని… అంతర్జాతీయ స్థాయి సాంకేతికతతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోందని సమాచారం. ఇక… పిరియాడిక్ లవ్ స్టోరీ `జిల్` ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతుండగా… ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే… ఈ చిత్రాన్ని కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఆ దిశగానే… నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని టాలీవుడ్ టాక్. మొత్తానికి… నాలుగు నెలల గ్యాప్‌లోనే ప్రభాస్ రెండు చిత్రాలతో సందడి చేయనున్నాడన్నమాట. ఇది యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు శుభవార్తే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=zECHmtibQD4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: