గత ఏడాది వేసవిలో విడుదలైన `మహానటి` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్‌లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. `మహానటి` తెచ్చిన గుర్తింపుతో… తెలుగునాట సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది కీర్తి. ఎట్టకేలకు… ఇటీవల మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి ఈ కేరళకుట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన దర్శకుడు నరేంద్ర దర్శకత్వంలో మహేష్ ఎస్.కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తితో పాటు మరో మూడు ముఖ్య పాత్రలు ఉంటాయని సమాచారం. ఇదిలా ఉంటే… `మహానటి`కి ఛాయాగ్రహణం అందించిన డ్యానీ ఈ సినిమాకి కూడా కెమెరామేన్‌గా వ్యవహరించనున్నారని తెలిసింది. త్వరలోనే డ్యానీ ఎంట్రీపై అధికారిక ప్రకటన వస్తుంది. అమెరికాలోనే సింహభాగం షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. కళ్యాణీ మాలిక్ స్వరాలు అందించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి వచ్చే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=fQhu517vBRw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: