గత ఏడాది `ఆఫీసర్`, `దేవదాస్` చిత్రాలతో సందడి చేసిన కింగ్ నాగార్జున… ప్రస్తుతం హిందీలో `బ్రహ్మాస్త్ర`తో పాటు తమిళ చిత్రం `రుద్రన్`తో బిజీగా ఉన్నారు. తెలుగులో మాత్రం తదుపరి సినిమాని ఇంకా ప్రారంభించలేదు. గత కొన్నాళ్ళుగా `మన్మథుడు`, `సోగ్గాడే చిన్ని నాయనా` చిత్రాల సీక్వెల్స్‌తో నాగ్ ఈ ఏడాదిలో అభిమానులను పలకరించబోతున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం… త్వరలోనే ఈ చిత్రాలు సెట్స్ పైకి వెళ్ళనున్నాయని సమాచారం. అయితే… మొదట `మన్మథుడు` సీక్వెల్‌ని పట్టాలెక్కిస్తారని… ఆ తరువాతే `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుందని టాక్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో `మన్మథుడు` సీక్వెల్‌ని… కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్‌ని నిర్మించే దిశగా అన్నపూర్ణ స్టూడియోస్ సన్నాహాలు చేసుకుంటోందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=22j7vTZjjTk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: