23 ఏళ్ల క్రితం వెండితెరపై సంచలనం సృష్టించిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ ఎట్టకేలకు ప్రారంభమైంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఈనెల 18 నుండి ప్రారంభించారు. ఇక ప్రారంభంముందు నుండే భారతీయుడ 2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు భారతీయుడు గెటప్ లో కమల్‌హాసన్ ఫస్ట్ లుక్ కు అందరూ ఫిదా అవ్వడంతో.. ఈ సీక్వెల్ కూడా భారతీయుడు సినిమాలాగ మంచి విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ నటిస్తుండగా మరో కొరియన్ హీరోయిన్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదే సినిమాలో అక్షయ్ కుమార్ కూడా నటించబోతున్నట్టు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించనున్నారట. మరి గతంలో అజయ్ దేవగన్ పేరు కూడా వినిపించింది. ఇలా రోజుకో పేరు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో ఓ క్లారిటీ రావాలంటే మాత్రం శంకర్ అధికారికంగా ప్రకటించేంత వరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=SPLLbmTkuBM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: