‘ఒరు అదార్ లవ్’లో ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటలో కన్ను గీటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఆ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్. ‘ఒరు అదార్ లవ్’ ఇంకా రిలీజ్ కాలేదు కానీ… తాను మాత్రం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరోసారి శ్రీదేవి బంగ్లా అనే సినిమాతో టాక్ ఆఫ్ ద టౌన్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం శ్రీదేవి బంగ్లా అనే సినిమాలో నటిస్తుంది. ఇక ఈసినిమా ట్రైలర్ ఇటీవల విడుదలవ్వగా అది కాస్త మరో వివాదానికి దారి తీసింది. సినిమా టైటిల్ శ్రీదేవి బంగ్లా అని ఉండటం… ట్రైలర్ చివర్లో.. బాత్ టబ్‌లో పడిపోయి ఓ యువతి చనిపోవటం చూపించటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక దీనికి గానూ శ్రీదేవి భర్త బోని కపూర్.. ప్రియా వారియర్ కు డైరెక్టర్ ప్రశాంత్ మాంబుల్లికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ వివాదంపై టాలీవుడ్, బాలీవుడ్‌లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై నటి ప్రియా ప్రకాష్ వారియర్ స్పందించింది. ‘‘శ్రీదేవి అనేది ఈ సినిమాలో నా పేరు మాత్రమే.. ఈ సినిమాకు శ్రీదేవి గారికి ఎలాంటి సంబంధం లేదు.. సినిమా చూస్తే ఈ విషయం అర్దమైపోతుంది అని తెలిపింది.
[youtube_video videoid=ISSJx9e4em0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: