భారతదేశపు తొలి సినీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎల్ వీ ప్రసాద్

Latest Telugu Movie News, LV Prasad Biography, LV Prasad Birth Date, LV Prasad Latest News, Remembering LV Prasad Garu On His 111th Birth Anniversary, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Remembering LV Prasad Garu On His 111th Birth Anniversary

ఆర్థిక బాధలతోఅప్పుల పాలైన తండ్రి, కొత్తగా కాపురానికి వచ్చిన భార్యకు ఏ అచ్చటా ముచ్చటా తీర్చలేని ఆర్థిక పరిస్థితి , ఎటు చూసినా నిరాశ, నిస్పృహ – ఇలాంటి స్థితిలో ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిన ఒక వ్యక్తి ఒక సంస్థగా, వ్యవస్థగా ఎదుగుతాడని ఎవరైనా ఊహించగలరా?

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారతీయ చలనచిత్ర రంగానికి ఒక మూలస్తంభంగా, ఒక దిక్సూచిగా వెలుగుతాడని ఎవరైనా అంచనా వేయగలరా ? భారత చలనచిత్ర రంగంలోని సమస్త పరిణామాలకు సాక్షీభూతంగా నిలుస్తారని ఎవరైనా అనుకోగలరా?

నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రతిభా ప్రదర్శనతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే తలమానికంగా నిలుస్తారని ఎవరైనా కలగనగలరా ? ఇలాంటి అసాధ్యాలన్నింటినీ అవలీలగా సాధించి ఒక సమగ్ర సినీ శిఖరంగా ఎదిగిన కార్యసాధకులు, కార్యదక్షులు ఎల్.వి.ప్రసాద్. 1908 జనవరి 17న ఏలూరు సమీపంలోని సోమవరప్పాడు గ్రామంలో అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ కుమారుడుగా జన్మించిన అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ ఎలాంటి పరిస్థితుల్లో ఇల్లు వదిలి బొంబాయి వెళ్లారో , చిత్ర పరిశ్రమలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో, క్రమంగా ఎలాంటి మహోన్నత లక్ష్యాల వైపు అడుగులు వేశారో, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతటి స్థాన విశిష్టతను సాధించుకున్నారో కొత్త గా చెప్పవలసింది ఏమీ లేదు.

ఆ సినీ ఘనాపాటి గురించి ఏమి చెప్పినా, ఎంత చెప్పినా అది చర్విత చరణమే అవుతుంది. అట్టడుగుస్థాయి నుండి అత్యున్నత శిఖరాగ్రాలకు చేరుకునే క్రమంలో తాను ఎదుగుతూ కొన్ని వందల, వేల కుటుంబాలలో జీవనజ్యోతులు వెలిగించి Live and let live అనే సామాజిక ధర్మానికి ప్రతీకగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఎల్.వి.ప్రసాద్.

బహు భాషలు, బహు వ్యాపకాలు, బహు సంస్థలు వెరసి అన్ని విభాగాలలో, అన్ని భాషలలో, అన్ని ప్రాంతాలలో అద్భుత విజయాలు సాధించి భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు వారి విజయ పతాకాన్ని ఎగురవేసిన మొట్టమొదటి వ్యక్తి ఎల్ వీ ప్రసాద్. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఒరియా ఇత్యాది భాషలలో సినిమాలు నిర్మించి, నటించి, దర్శకత్వం వహించి అద్భుత విజయాలను అందిపుచ్చుకున్న “ఇండియన్ ఫిలిం ఐకాన్” ఎల్ వి ప్రసాద్.

కాలే కడుపుతో, ఖాళీ జేబుతో సినిమా రంగంలో కాలు మోపిన ఎల్.వి.ప్రసాద్ భారత దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో స్టూడియోలు, లేబరేటరీస్ నిర్మించి దశాబ్దాలుగా భారత చలన చిత్రరంగ ఉపాధికి, ఉద్దీపనకు ప్రధాన కారకులలో ఒకరయ్యారన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం.

అందుకే “దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు” మొదలుకొని భారతావనిలోని సమస్త ప్రతిష్టాత్మ సినీ ఘన పురస్కారాలు ఆ మహామహుని వరించాయి.

ప్రసాద్ ప్రొడక్షన్స్, ప్రసాద్ ఫిలిం ల్యాబ్స్, ప్రసాద్ వీడియో డిజిటల్స్, ఎల్.వి.ప్రసాద్ ఫిలిం ఇనిస్టిట్యూట్ అండ్ టెలివిజన్ అకాడమీ, ప్రసాద్ మల్టీప్లెక్స్, ప్రసాద్ ఐమాక్స్, ప్రసాద్ ఈ. ఎఫ్. ఎక్స్., ఆనంద్ సినీ సర్వీస్ వంటి సమస్త సినీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు ఆ మహామహుడి ప్రతిభా విశేష ఫలితాలే. ఆ సినీ దిగ్గజం ప్రతిష్టను పదిల పరుస్తూ, పదింతలు చేస్తూ ఆయన కుమారులు రమేష్ ప్రసాద్ సాగిస్తున్న నిరంతర సినీ ప్రయాణం కూడా అభినందనీయం.

భారతీయ చిత్ర పరిశ్రమ వికాసానికి, అందులో తెలుగువాడి ప్రాధాన్యతకు ప్రతీకగా, ప్రతిరూపంగా నిలిచిన ఎల్.వి.ప్రసాద్ స్మృతికి ఘన నివాళి అర్పిస్తూ ఆ మహామహుడి ఆత్మ శాంతిని ఆకాంక్షిస్తూ తన తరఫున, తన పాఠకుల తరఫున అంజలి ఘటిస్తోంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం”.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 3 =