నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో తమిళనాడు ముఖ్యమంత్రి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శిని, ‘ది ఐరన్ లేడీ’ టైటిల్ తో జయలలిత బయోపిక్ ను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ ను జయలలిత బయోపిక్ లో మీరు నటిస్తున్నారు కదా.. ఈ సినిమా ఆఫర్ అసలు మీకు రాకముందు ఆమె గురించి మీ ఒపీనియన్ ఎలా ఉండేది అని ప్రశ్నించగా.. దానికి నిత్యామీనన్ తన దైన శైలిలో సమాధానం చెప్పింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జయలలిత పట్ల నాకు ఎప్పుడూ ఆసక్తి ఉండేది.. అయితే రాజకీయాల గురించి నాకు పెద్దగా ఏం తెలియదు.. ఆ కోణంలో కాదు కాని…ఒక సామాన్య వ్యక్తిగా ఆమె పట్ల నాకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉండేది.. ఆమె పై ఎప్పుడూ సానుభూతి ఉండేది…తను అలా ఎందుకు ఉండేదో.. నేను అర్థం చేసుకోగలిగాను అని తెలిపింది. తను ఏం చేసిందో.. ఏం చేయలేదో.. ఎందుకు చేసిందో..ఎందుకు చేయలేదో అని కాదు.. కేవలం ఒక మానవత కోణంలోనే చూశాను.. అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నాని తెలిపింది.
కాగా ఈ బయోపిక్ లో జయలలిత పాత్రకి గాను నిత్యా మీనన్ ను .. ఎంజీఆర్ పాత్రకి గాను మలయాళ నటుడు సుకుమార్ ను .. శశికళ పాత్రకి గాను వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేసుకున్నారు. ఇటీవలే జయలలిత చనిపోయిన రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే నెల 24వ తేదీ నుండి ప్రారంభించనున్నారు. ఇక ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ఇక్కడే హైదరాబాద్ లో జరగనున్నట్టు తెలుస్తోంది. దీని కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మరి చూద్దాం ఈ సినిమాలో ఏం ఆసక్తికర విషయాలు చూపిస్తారో..
[youtube_video videoid=ISSJx9e4em0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: