సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరా పండుగ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈలోపు ఈ సినిమాకు సంబంధించి పలు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న పలువురి ఫస్ట్ లుక్స్ విడుదల చేయగా…ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న విజయ సేతుపతి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు విజయ్ సేతుపతి తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా..సైరా చిత్రబృందం సినిమాలో విజయ్ సేతుపతి లుక్ ని రివీల్ చేస్తూ పోస్టర్ ను, మోషన్ టీజర్ ను విడుదల చేసింది. రాజా పాండి అనే పాత్రలో నటిస్తున్న విజయ సేతుపతి..ఓ వీరుడిలా కత్తి పట్టుకుని రౌద్రమైన్ లుక్ తో కనిపిస్తూ ఆకట్టుకునే లా ఉంది. ఈ ఫొటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Wishing Makkal Selvan @VijaySethuOffl a very Happy Birthday. Here’s the dynamic look of #RaajaPaandi from #SyeRaaNarasimhaReddy.#HBDVijaySethupathi #SyeRaa pic.twitter.com/5wvFWVtNcZ
— Konidela Pro Company (@KonidelaPro) January 16, 2019
కాగా ఈ చిత్రంలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, నయన తార, తమన్నా, సుధీప్, విజయ సేతుపతి లాంటి తదితర ప్రముఖ నటీనటులు ఎందరో ఇందులో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=DKGw7ItwTkk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: