`జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ హాస్యనటుడు `థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ` పృథ్వీ కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. ఇప్పటివరకు పృథ్వీ పోషించని విలక్షణ పాత్ర ఇదని… నటనకు అవకాశమున్న ఈ పాత్ర పృథ్వీలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని టాలీవుడ్ టాక్. త్వరలోనే పృథ్వీ పాత్రకు సంబంధించి… క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా… విజయదశమి కానుకగా బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ తెరపైకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: