నటసింహ నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రల్లో కనిపించిన సందర్భాలు అరుదనే చెప్పాలి. `త్రి మూర్తులు` (1987), `ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?` (2012) చిత్రాల్లో ఆయన స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. మళ్ళీ…చాన్నాళ్ళ తరువాత ఓ సినిమా కోసం గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారట బాలయ్య. అయితే… ఈ సారి తెలుగు చిత్రంలో కాదు.. ఓ కన్నడ చిత్రంలో నటించేందుకు ఈ నందమూరి అందగాడు సిద్ధమవుతున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం `భైరతి రణగళ్`. ఈ సినిమా… నటుడిగా శివరాజ్ కుమార్ 125వ చిత్రం కావడంతో… దర్శకనిర్మాత నార్తన్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కాగా… ఈ సినిమాలో ఓ కీలకమైన అతిథి పాత్ర ఉంది. ఈ నేపథ్యంలో… ఆ పాత్రను పోషించవలసిందిగా బాలయ్యను సంప్రదించిందట యూనిట్. పాత్ర నచ్చడంతో పాటు… రాజ్ కుమార్ కుటుంబంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం దృష్ట్యా కూడా బాలకృష్ణ వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. త్వరలోనే బాలకృష్ణ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. బాలకృష్ణ వందో చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`లో శివరాజ్ కుమార్ అతిథి పాత్ర పోషించగా… ఇప్పుడు శివ రాజ్ కుమార్ 125వ చిత్రంలో బాలయ్య గెస్ట్ రోల్ చేయనుండడం విశేషమనే చెప్పాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: