వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రవిప్రకాష్ కృష్ణం శెట్టి నిర్మించిన చిత్రం అదృశ్యం. హారర్, థ్రిల్లర్, కామెడి, ప్రధానాంశముగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ను శనివారం ఫిల్మిఛాంబర్లో హీరో జాన్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో…
మ్యూజిక్ డైరెక్టర్ ఆల్డ్రిన్ మాట్లాడుతూ… తెలుగులో ఇది నా మొదటి చిత్రం. బేసిక్గా నేను తెలుగువాడిని కాకపోతే చెన్నైలో సెటిల్ అయ్యాను. శ్రవంతి మూవీస్కి వర్క్ చేశాను. నేను చెన్నైలో మ్యూజిక్ కోర్సు చేశాను. తమిళ్లో దాదాపుగా 7 చిత్రాలకు సంగీతాన్ని అందించాను. ఈ సంవత్సరం నాకు గొప్పగా ఉంటుందని భావిస్తున్నాను. తెలుగులో కూడా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. నన్ను మీరందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు.
హీరో జాన్ మాట్లాడుతూ… తెలుగులో ఇది నా మూడవ చిత్రం. అదే నువ్వు అదేనేను, బంటీ ద బ్యాడ్ బోయ్ తర్వాత నేను నటించే మూడవ చిత్రమిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రవిగారికి నా కృతజ్ఞతలు. తెలుగు ఇండస్ర్టీ చాలా పెద్దది. చాలా బావుంటుంది. ఈ రోజు లెజండరీ డైరెక్టర్ కె. విశ్వనాధ్గారిని కలిసి మా ఆడియోని రిలీజ్ చేశాము. ఆయన నన్ను చూసి ప్రభాస్లా ఉన్నావు అన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అంత పెద్ద డైరెక్టర్ నన్ను పొగడడం అంటే మాములు విషయం కాదు, అందరూ నన్ను తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.
దర్శకుడు రవిప్రకాష్ మాట్లాడుతూ… ముందు నా కెరియర్ మొదలైంది కె.విశ్వనాధ్గారి దగ్గర. ఆయన దగ్గర కో డైరెక్టర్గా చాలా సినిమాలకు పని చేశాను. తర్వాత సింగీతం శ్రీనివాస్ గారు దగ్గర 14 సినిమాలకు పని చేశాను. నేను చాలా అదృష్టవంతుడిని అలాంటి లెజండరీ డైరెక్టర్ల దగ్గర పని చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. హీరో జాన్ ఆల్రెడీ నా పిల్లల చిత్రం చేశారు. అందుకే ఆయన్నే హీరోగా ఎంచుకున్నా. నేను చేసిన బంటీ ద బ్యాడ్ బాయ్ కి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఒక రివార్డు వచ్చే సినిమా చెయ్యాలని ఈ సినిమా చేస్తున్నాను. ఇది ఒక థ్రిలర్.చాలా అత్యాధ్బుతంగా ఉంటుంది. చిత్రంలో ఎక్కడా ల్యాగ్ ఉండదు. సినిమా ఇంట్రస్టింగ్గా ఉంటే చాలు బడ్జెట్ తో పనిలేదు. నా హీరోకి నేను ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. ఇందులో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. జయవాణి ఒక మాంత్రికురాలిగా ప్రత్యేక పాత్రలో చేశారు. చాలా బాగా చేశారు. టెక్నీషియన్లు అందరూ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. అందువల్లే ఈ చిత్రం చాలా బాగా వచ్చింది మీరందరూ తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులుః
ప్రముఖ సింగర్ కల్పన (పోలీస్ ఆఫీసర్ పాత్రలో) అంగనారాయ్ నెగెటివ్ షేడ్ హీరోయిన్, జబర్దస్త్ ఆర్.పి.వినోద్, అప్పారావు, హీరో జాన్, హీరోయిన్ ప్రియాంక, హర్షద, తేజారెడ్డి, జయవాణి, కె.కోటేశ్వరరావు, వంశీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంఃఆల్డ్రిన్, డి.ఓ.పి. రామ్పినిశెట్టి, పాటలుఃవెన్నెలకంటి, ఎడిటింగ్ఃఆకులభాస్కర్, మాటలుఃనాగులకొండ నవకాంత్, ఫైట్స్ఃకృష్ణంరాజు, డ్యాన్స్ఃసుజ్జి, చార్లీ, నిర్మాత, దర్శకుడుఃరవిప్రకాష్క్రిష్ణంశెట్టి
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: