పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మజిలీ. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ లో సమంత-నాగచైతన్య ఉండగా..ఇప్పుడు దివ్యంశ కౌశిక్ – నాగ చైతన్య సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. దానితో పాటు మూవీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసేశారు. ఏప్రిల్ 5వ తేదీన సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here’s refreshing #Majili2ndLook featuring Yuvasamrat @Chay_Akkineni and @divyanshak_
Releasing worldwide on 5th AprilA film by @ShivaNirvana #Majili @Samanthaprabhu2 @sahrudayg @harish_peddi #GopiSundar @Shine_Screens @VishnuSarmaDOP @sahisuresh #ChaySam4 #MajiliOnApr5th pic.twitter.com/SmGgeUx5AI
— Shine Screens (@Shine_Screens) January 14, 2019
శివ నిర్వాణ దర్శత్వం వహిస్తున్న ఈ సినిమాలో చైతన్య మాజీ క్రికెటర్ గా, సమంత రైల్వే క్లర్క్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. షైన్ స్క్రీన్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గరపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ మరోక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=ISSJx9e4em0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: