`బాహుబలి` సిరీస్‌తో నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం ఈ మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్… యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తెరపై చాలా కాలం తరువాత వస్తున్న సిసలైన మల్టీస్టారర్ కావడంతో… ఈ భారీ బడ్జెట్ మూవీపై సర్వత్రా మంచి అంచనాలే ఉన్నాయి. కేవలం తెలుగులోనూ కాకుండా… ఇతర భాషల్లోనూ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` (వర్కింగ్ టైటిల్)… ఫిబ్రవరి నుంచి రెండో షెడ్యూల్ జరుపుకోనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఇప్పటివరకు ఈ సినిమాలో నటించే కథానాయికల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం… యన్టీఆర్, రామ్ చరణ్ రేంజ్ కు తగ్గ హీరోయిన్లను అన్వేషించే పనిలో ఉన్నారట రాజమౌళి. ఇద్దరు బాలీవుడ్ భామలతో పాటు కొంతమంది దక్షిణాది తారల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయని… త్వరలోనే కథానాయికల ప్రకటన వస్తుందని సమాచారం. మరి.. ఆ లక్కీ హీరోయిన్లు ఎవరో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగకతప్పదు అన్నమాట. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ క్రేజీయస్ట్ ప్రాజెక్ట్… 2020లో తెరపైకి రానుంది.
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: