మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం పోషించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అలాంటి చిత్రాలలో… ‘దొంగమొగుడు’ ఒకటి. చిరు హీరోగా పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ఎ.కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యండమూరి వీరేంద్రనాథ్ రచించిన `నల్లంచు తెల్లచీర` నవల ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఎస్.పి.వెంకన్నబాబు నిర్మించారు. మాధవి, రాధిక, భానుప్రియ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో… ఇతర ముఖ్య పాత్రల్లో జయంతి, రంగనాథ్, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, చరణ్‌రాజ్, సుత్తి వేలు దర్శనమిచ్చారు. చక్రవర్తి స్వరకల్పనలో పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ‘నల్లంచు తెల్లచీర’, ‘ఈ చెంపకు సెలవీయకు’, ‘కోకమ్మ చెప్పమ్మా’, ‘నీ కోకకెంత చురుకెందుకు’, ‘ఇడ్లీ పాప’… అలాగే క్లైమాక్స్‌లో వచ్చే ‘అద్దెమ రేయి మద్దెల దరువండి’… ఇలా ప్రతీ పాట మెగాభిమానులను మురిపించింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9, 1987న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా… నేటితో 32 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=abuZFm_8eMs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: