వరుస విజయాలతో తెలుగునాట యూత్ ఐకాన్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం` ఘనవిజయాలతో టాలీవుడ్‌లో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో `డియర్ కామ్రేడ్`తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే… విజయ్ దేవరకొండ హిట్ చిత్రాలకు ఇతర భాషల్లోనూ రీమేక్ రైట్స్ పరంగా మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య `అర్జున్ రెడ్డి` రీమేక్‌పై గట్టిపోటీ నెలకొనగా… ఇప్పుడు `గీత గోవిందం` రీమేక్ వెర్షన్స్ పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ రెండు సినిమాలూ హిందీలోనూ తెరకెక్కుతుండగా… `అర్జున్ రెడ్డి` రీమేక్ `కబీర్ సింగ్`లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుంటే.. `గీత గోవిందం` హిందీ రీమేక్‌లో షాహిద్ తమ్ముడు, ‘ధడక్’ ఫేం ఇషాన్ ఖత్తర్ నటించచోతున్నాడని బాలీవుడ్ టాక్. త్వరలోనే `గీత గోవిందం` హిందీ రీమేక్‌పై క్లారిటీ వస్తుంది. ఏదేమైనా… విజయ్ కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రాలను ఇప్పుడు హిందీనాట అన్నదమ్ములు రీమేక్ చేస్తుండడం విశేషమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=1ZLTAIfJzvc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: