మెగా బ్రదర్ నాగబాబు మరోసారి బాలకృష్ణపై సెటైర్లు వేశారు. గతంలో బాలయ్య అంటే ఎవరో తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో అసలు రచ్చ మొదలైంది. ఇక నాగబాబు చేసిన వ్యాఖ్యలకు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించి నాగబాబుపై విమర్శలు గుప్పించారు. దాంతో నాగబాబు ఆ విమర్శలపై స్పందించి… సారీ బాలయ్య నాకు తెలియకపోవడం ఏంటీ.. ఆయన చాలా మంచి కమెడియన్.. నాకు తెలియదని చెప్పడం తప్పే అంటూ ఆనాటి కమెడియన్ బాలకృష్ణ ఫొటో చూపిస్తూ.. కాస్త ఎటకారంగానే సమాధానం ఇచ్చారు. దాంతో బాలకృష్ణ అభిమానులు ఇంకా రెచ్చిపోయి నాగబాబుపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.. ఇంకా విమర్శిస్తునే ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఆ తరువాత దీనిపై రియాక్ట్ అవ్వని నాగబాబు..మళ్లీ ఇన్నిరోజులకు దీనిపై స్పందించి సైటెర్ వేశారు. అయితే ఈసారి డైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చారు నాగబాబు. దీనిలో భాగంగానే తాజాగా దీనిపై వివరణ ఇస్తూ మరో నాలుగు వీడియోలు వదిలారు. మొదట వీడియోలో పవన్ కళ్యాణ్ తెలియదు అన్న దానిపై స్పందిస్తూ.. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఎంతగానో సహకరించాడు కాగా అలాంటి నా తమ్ముడ్ని పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు అని అన్నారు అక్కడ చాలా హర్ట్ అయ్యాను అందుకే నేను కూడా తెలియదు అన్నాను.. నేను అంటే మీకు బాధ కలిగినప్పుడు మీరు అన్నప్పుడు మాకు బాధ ఉండదా ? అంటూ ఆన్సర్ ఇచ్చారు. అలాగే గడిచిన నాలుగైదేళ్ల లో మా కుటుంబం పై రకరకాల కామెంట్స్ చేసారు అందుకే ఇలా రియాక్ట్ కావాల్సి వచ్చిందన్నారు.
మరో వీడియోలో.. అమితాబ్ బచ్చన్ ను ఏం పీకాడు? అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు? స్వర్గీయ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టారో.. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా అంతే పెద్ద స్టార్ అని..అలా అన్నప్పుడు చాలా బాధ కలిగిందని..అయినా ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేదనీ, కానీ ‘చిరంజీవి ఏమయ్యాడు’ అని బాలయ్య వ్యాఖ్యానించారు…ఈ టాపిక్ లో తమ కుటుంబాన్ని చేర్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నాగబాబు ప్రశ్నించారు. మీ బ్లడ్ వేరు.. మీ బ్రీడ్ వేరు అని అన్నారు… మీరేమన్నా ఆకాశం నుంచి దిగివచ్చారా? లేకపోతే మీరేమయినా సూర్య వంశీకులా? మమ్మల్ని అవమానిస్తే మాకు కోపం రాదా?’ అని ప్రశ్నించారు. అంతేకాదు పలు కామెంట్లపై కూడా ఆయన స్పందిస్తూ వీడియోలు వదిలారు. ఆ వీడియోలు మీరు కూడా చూడండి…
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: