అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్. సంక్రాంతి కానుకగా ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్, ఆడియో కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ పొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకీ, వరుణ్ సరసన తమన్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఇలాంటి కామెడీ చేయడం వెంకీ కీ కొట్టిన పిండి లాంటిది. కానీ ఈ తరహా సినిమా చేయడం వరుణ్ తేజ్ కి ఇదే మొదటిసారి. మరి తన కామెడీతో వరుణ్ తేజ్ కూడా ప్రేక్షకులను మెప్పించగలిగితే ఈ సినిమాకు ఇక తిరుగులేనట్టే. మరి చూద్దాం సంక్రాంతి పోటీలో ఎంత వరకూ విజయం సాధిస్తారో..!
[youtube_video videoid=i8-wtoLWxMw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: