డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక డిఫరెంట్ టైటిల్స్ పెట్టడంలో పూరీ తరువాతే ఎవరైనా… అలాగే ఈసారి కూడా రామ్ సినిమాకు ఇస్మార్ట్ శంకర్ అనే విచిత్రమైన టైటిల్ ను పెట్టాడు. ఇస్మార్ట్ శంకర్ డబుల్ సిమ్ అని వచ్చిన ఫస్ట్ లుక్..టైటిల్ అందరికీ నచ్చేసింది. అంతేకాదు ఈ సినిమాలో రామ్ ఫుల్ తెలంగాణ యాసలో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా మరో లేటెస్ట్ అప్ డేట్ తో ముందుకొచ్చారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు చిత్రయూనిట్. మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా..రాజ్ తోట సినిమాటోగ్రఫీగా పనిచేయనున్నాడు.
కాగా యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను పూరీ టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్ , ఛార్మి కలిసి నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ను మాత్రం ఇంకా ఎంపిక చేయలేదు. కొత్త ఫేస్ కోసమే పూరీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేసేయనున్నట్టు ఇప్పటికే చెప్పేశారు. ఇక ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ఇద్దరూ ఎదురుచూస్తున్నారు. మరి వీరిద్దరికీ ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ తెచ్చి పెడుతుందో చూద్దాం..
[youtube_video videoid=sv-YLoucBM8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: