బాలీవుడ్ మూవీ రీమేక్‌లో నాగ చైతన్య?

Naga Chaitanya To Star In A Remake?,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Naga Chaitanya In Telugu Remake Of Chhichhore Movie,Chhichhore Movie Remake,Chhichhore Movie Updates,Naga Chaitanya New Movie Details

ప్రస్తుతం తెలుగునాట అగ్ర కథానాయకుల నుంచి యువ క‌థానాయ‌కుల వరకు అంద‌రూ పరభాషా చిత్రాల రీమేక్‌ల వైపు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఈ వ‌రుస‌లోనే యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా తాజాగా ఓ రీమేక్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ఇటీవల హిందీనాట ఘనవిజ‌యం సాధించిన‌ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఛిఛోరే’ను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధాకపూర్, నవీన్ పోలిశెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో చైతూ హీరోగా నటించనుండగా… ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ తెరకెక్కించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు… ఈ సినిమా తాలూకు తెలుగు రీమేక్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం తన మేనమామ ‘విక్టరీ’ వెంకటేష్‌తో కలసి చైతూ నటిస్తున్న ‘వెంకీమామ’… డిసెంబ‌ర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తున్న ప్రేమ‌క‌థా చిత్రంలోనూ చైతూ న‌టిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − six =