కోలీవుడ్ స్టార్ విశాల్, సీనియర్ డైరెక్టర్ సి.సుందర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘యాక్షన్’. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ట్రిడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆదెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై ’యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ లతోనే భారీ అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ రోజు యాక్షన్ సినిమా విడుదలవ్వగా… ఈ రోజే తన కొత్త సినిమా గురించి ప్రకటించాడు. ‘చక్ర’ అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్ ,ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. టైటిల్ లోగో అండ్ డిజైనింగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
Here we go, Presenting the Title & First Look of #Vishal‘s #Chakra @VishalKOfficial @VffVishal @ReginaCassandra @ShraddhaSrinath @thisisysr @manobalam @srushtiDange @iamrobosankar @AnandanMS15 pic.twitter.com/7rP3XHh9X3
— Vishal Film Factory (@VffVishal) November 15, 2019
ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీరెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఎం ఎస్ ఆనందన్ తెరకెక్కించనున్నాడు. గత ఏడాది సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో వచ్చిన అభిమన్యుడు చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఆయన స్వయంగా నిర్మిస్తుండగా శ్రద్దా శ్రీనాధ్, రెజీనా కాసాండ్రా, శ్రుతీ డాంగే హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: