బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఒక అందమైన ప్రేమ కథ రూపొందుతున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ సమర్పణ లో ఆసియన్ సినిమాస్ నారాయణ దాస్ K నారంగ్, P రామ్మోహనరావు నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ రొమాంటిక్ డ్రామా షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభమయింది. పవన్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగచైతన్య, సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ ని ప్రేమికులరోజు (ఫిబ్రవరి 14)న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మూవీ క్యారెక్టర్ కై హీరో నాగచైతన్య తెలంగాణ యాస భాషను నేర్చుకొనడం విశేషం. నాగచైతన్య, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందిన మల్టీ స్టారర్ వెంకీ మామ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సాయి పల్లవి విరాట పర్వం మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సూపర్ హిట్ మజిలీ మూవీ తరువాత నాగచైతన్య నటిస్తున్న ఈ మూవీ కై ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: