ప్రభాస్ మనసులో మాట

2019 Latest Telugu Film News, Prabhas Opens Up About Upcoming Big Budget Movies, Prabhas About Upcoming movie Projects, Prabhas Latest Movie News, Prabhas Comments on Upcoming High Budget Movies, Saaho Movie Latest News, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News

భారతీయ చలన చిత్ర పరిశ్రమ లో తనకంటూ ఒక గుర్తింపు పొందిన స్టార్ హీరో ప్రభాస్ ప్రతీ విషయం లో కూల్ గా ఉంటారు . బాహుబలి మూవీ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న ప్రభాస్ ఒక ఇంటర్ వ్యూ లో మాట్లాడుతూ .. తాను నటించిన మూవీ ని మొదటిరోజు చూడాలనుకొంటాను కానీ, ధైర్యం చాలదని, సాహో మూవీ ని కూడా 4లేదా 5రోజుల తరువాత థియేటర్ లో చూస్తానని అన్నారు. బాహుబలి తరువాత ఒక లవ్ స్టోరీ లో నటించాలనుకున్నా నని, సరైన స్క్రిప్ట్ లభించలేదని, ఆ టైమ్ లో దర్శకుడు
సుజీత్ సాహో స్క్రిప్ట్ తో కలిశారని ప్రభాస్ చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ స్క్రిప్ట్ సాహో నచ్చిందని, 1ఇయర్ లో షూటింగ్ కంప్లీట్ అవుతుందనుకొన్నామని, 2సంవత్సరాలు పట్టిందని, రాబోయే 5 సంవత్సరాల వరకు బిగ్ మూవీస్ చేయనని, ప్రతీ మూవీ కి ప్రెజర్ తీసుకోనని, బాహుబలి పెద్ద మూవీ అని, అటువంటి సినిమాలకు చాలా టైమ్ పడుతుందని అన్నారు. సాహో మూవీ స్క్రీన్ ప్లే ఆసక్తిగా ఉండటంతో ఓకే చేశానని, దర్శకుడు సుజీత్ ను తనతో పాటు నిర్మాతలు కూడా నమ్మా రని , సాహో తన రెండవ చిత్రమైనా సుజీత్ కాన్ఫిడెంట్ తో రూపొందించారని ప్రభాస్ అన్నారు. సాహో మూవీ కి యాక్షన్ సీన్స్ హై లైట్ అని, యాక్షన్ సీన్స్ లో బైక్ సీన్స్ పెద్ద టాస్క్ అని, 40, 50 మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేశారని, సేఫ్ మెజర్స్ తోనే చిత్రీకరణ జరిగిందని, బాహుబలి మూవీ టైమ్ లో ప్రోటీన్ ఫుడ్ తో హెవీ గా మారానని,
5మంత్స్ డైట్ చేసి ఈ మూవీ కై వెయిట్ లాస్ చేసుకున్నానని, బాహుబలి మూవీ తరువాత అనుభవం సంపాదించానని, రోజుకు తెలుగు, తమిళ, హిందీ భాషలలో 20 వరకు ఇంటర్వ్యూ లు ఇస్తున్నానని, బాహుబలి స్టోరీ బాగుండటంతో ప్రేక్షకాదరణ పొందిందని, ప్రతీ మూవీ బాహుబలి లా ఉండాలని   ప్రేక్షకులు కోరుకోకూడదని ప్రభాస్ తన మనసులో మాట వెలిబుచ్చారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =