ఎవరు రివ్యూ – అడివి శేషు మార్క్ మరో క్రైమ్ థ్రిల్లర్ ఎవరు?

2019 Telugu New Movie Reviews, Evaru Movie Mouth Talk, Evaru Movie Public Opinion, Evaru Movie Public Talk, Evaru Movie Rating, Evaru Movie Review, Evaru Movie Story, Evaru Telugu Movie Review, Evaru Telugu Movie Review And Rating, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

ఎవరు ఏ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు… 
ఏ సీన్ ఎక్కడ నుండి లేపుకొచ్చారు… ఏది దేనికి మూలం… 
ఏది ఒరిజినల్… ఏది రీమేక్… ఏది ఏ పరభాషా సినిమాకి నకలు…  వంటి శోధనలు, పరిశోధనలు, రంధ్రాన్వేషణలు పక్కనబెడితే 
ఆ మర్మాలేవి తెలియకుండా థియేటర్లో కి ప్రవేశించిన ఒక సగటు ప్రేక్షకుడిని గొప్ప త్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తో బయటకు పంపిస్తే …
అదే మంచి సినిమా… 
అదే హిట్ సినిమా… 
అదే ప్రజెంట్ సినిమా…. 
అదే ప్లజెంట్ సినిమా.  

ఇలాంటి అనుభూతిని వరుసగా తన సినిమాల ద్వారా ఇస్తున్న ట్రెండింగ్ హీరో అడివి శేషు నుండి వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ఎవరు? 

మొన్న క్షణం, 
నిన్న గూడచారి,
ఈరోజు ఎవరు? 

ఈ మూడు చిత్రాల ద్వారా ముగ్గురు కొత్త దర్శకులు పరిచయం అయినప్పటికీ ఆ సినిమాల టేకింగ్, మేకింగ్ ,రైటింగ్ ల మీద అడవి శేషు ఇంపాక్ట్ బలంగా ఉంది అన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు.


క్షణం ద్వారా పరిచయమైన రవికాంత్, గూడచారి ద్వారా పరిచయమైన శశికిరణ్ తిక్క, ఇప్పుడు ఎవరు ద్వారా పరిచయమైన వెంకట్ రాంజీ ముగ్గురూ అత్యంత ప్రతిభావంతులైన యువ దర్శకులు అయినప్పటికీ స్వతహాగా స్క్రీన్ ప్లే రైటర్ అయిన హీరో ప్రాజెక్టును ఓన్ చేసుకుంటే ఎలాంటి అవుట్ పుట్ వస్తుంది అనటానికి  ఈ మూడు సినిమాలను ఈ ముగ్గురు దర్శకులతో అడవి శేషు జర్నీ ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే… అడవి శేషు గుడ్ గోయింగ్  మీద ఏర్పడిన గుడ్    ఎక్స్పెక్టేషన్స్ నేపథ్యంలో ఈ రోజు విడుదలైన “ఎవరు” ఎలా ఉందో చూద్దాం.

కథా ప్రారంభంలోనే ఒక ప్రముఖ యువ వ్యాపారవేత్త భార్య అయిన సమీరా( రెజీనా కసాండ్రా) దారుణంగా మానభంగానికి గురవ్వటంతో పాటు ఆత్మ రక్షణ కోసం తనమీద అత్యాచారయత్నం చేసిన అశోక్ (నవీన్ చంద్ర) అనే పోలీస్ ఆఫీసర్ ను దారుణంగా కాల్చి చంపింది అనే అభియోగంతో  అరెస్ట్ అవుతుంది.


కొద్ది రోజుల తరువాత ఆమెకు బెయిల్ దొరుకుతుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ నిమిత్తం విక్రమ్ వాసుదేవ్( అడివి శేషు) అనే ఒక పోలీస్ ఆఫీసర్ నియమితుడయ్యాడు. డబ్బు  కోసం అడ్డ దారులు తొక్కే విక్రమ్ వాసుదేవ్ ఈ కేసును ఎలా డీల్ చేశాడు.? హీరోయే కరెప్ట్ పోలీస్ అయితే న్యాయం అన్యాయమైపోతుంది కదా ..? మరి ఇందులో హీరో క్యారెక్టర్ కు క్యారెక్టర్  లేనట్టేనా ? అత్యాచార బాధితురాలు అయిన సమీరా హత్యాభియోగాన్ని ఎలా ఎదుర్కొంది? ఇన్వెస్టిగేషన్ నిమిత్తం సమీరా రూమ్ లోకి విక్రమ్ వాసుదేవ్ ప్రవేశించడంతో ప్రారంభం అయ్యే సినిమా అతను బయటకు రావటంతో పూర్తి అవుతుంది. ఏంటి…? 
ఈ రెండు గంటల్లో జరిగిన ఫ్లాష్ బ్యాక్ ఏమిటి?

సమీరా జీవితంలోని చీకటి కోణం ఏమిటి? ఒక మల్టీ మిలియనీర్ భార్య అయిన సమీరా మీద అత్యాచార యత్నం జరగడం ఏమిటి? ఆమె పోలీస్ ఆఫీసర్ ను చంపటం ఏమిటి? 
మధ్యలో వినయ్ వర్మ( మురళి శర్మ)
అనే పెద్దమనిషి అకారణ హత్యకు గురికావటం ఏమిటి?  అతని హత్యకు
సమీరా కేసుకు సంబంధం ఏమిటి?
ఇలాంటి ఎన్నో అనూహ్యమైన ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది
“ఎవరు” అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.

వెంకట్ రామ్జీ టేకింగ్ : 

ఈ చిత్రం  ద్వారా దర్శకుడిగా  పరిచయమైన  వెంకట్ రామ్ జీ టేకింగ్ సింప్లీ సూపర్బ్ అని చెప్పవచ్చు. ఒక క్రైమ్ థ్రిల్లర్ ను ప్రజెంట్ చేసేటప్పుడు “లాక్స్ అండ్ అన్ లాక్స్ ” విషయంలో ఎంత సస్పెన్స్ మెయిన్టైన్ చేయాలో అంత సస్పెన్స్ మెయిన్టెన్ చేసి  వెల్ డన్ అనిపించుకున్నాడు వెంకట్. అంతకుముందు ఫిలిం మార్కెటింగ్ విభాగంలో పనిచేసిన తాలూకు అనుభవాన్ని ఇప్పుడు డైరెక్టర్ గా తన క్రియేటివిటీకి జోడించడం వల్ల కాబోలు సినిమా లో ఎక్కడా గ్రిప్ అన్నది డ్రాప్ అవ్వకుండా పర్ఫెక్ట్ టెంపోలో కథా కథనాలు నడిపించిన తీరు చాలా బాగుంది. ఒక డెబ్యూ డైరెక్టర్ నుండి ఇంత మంచి ప్రజెంటేషన్ రావటం నిజంగా అభినందనీయం. సినిమా అన్నది 24 శాఖల సంఘటిత ప్రయత్నం అయితే అన్ని శాఖల నుండి అద్భుతమైన రిజల్ట్ ను రాబట్టుకున్న వెంకట్ రాంజీకి దర్శకుడిగా గొప్ప భవిష్యత్తు ఉందనటానికి నిదర్శనంగా నిలుస్తుంది ‘ ఎవరు’ లోని అతని టేకింగ్ స్టైల్.One more sensitive and sensible director is proudly presented by PVP అని ఘంటాపథంగా చెప్పటానికి ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు.


ఇక టెక్నికల్ గా ఇతర విభాగాలను చూస్తే- ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ను బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లగలుగుతుంది అన్న నిజాన్ని మరోమారు నిజం చేసాడు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల. అలాగే వంశీ పచ్చి పులుసు సినిమాటోగ్రఫీ, బి హెచ్ గ్యారీ ఎడిటింగ్ చాలా బాగున్నాయి.ఇక అబ్బూరి రవి మాటలు ప్రత్యేక ప్రశంసార్హం అనే చెప్పాలి. సన్నివేశ, సందర్భాలకు తగినట్లు ఒక మాట ఎక్కువ ఒక మాట తక్కువ కాకుండా కొలత   వేసినట్టు “బ్యూటీ ఆఫ్ ద బ్రివిటీ ” ని  మాటల్లో చూపించాడు అబ్బూరి రవి .

ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే- 
ఫస్ట్ బెస్ట్  అనే క్రెడిట్ ను
అడవి శేషు కు కట్ట బెట్టాలా
రెజీనాకు కట్టబెట్టాలా ? 
ఒక రూమ్ లో ఇద్దరి మధ్య రెండు గంటలపాటు జరిగే సంభాషణ, సంవాదం, సంఘర్షణలలో నటన పరంగా  ఎవరు బాగా చేశారు? ఎవరు బెస్ట్? అనేది జడ్జ్ చేయటం చాలా కష్టం అనే స్థాయిలో ఉంది వీళ్లిద్దరి పర్ఫార్మెన్స్. తెలిసిన నిజాలు దాచడం… తెలియని నిజాల కోసం
ఎత్తులు వేయడం, ఒకరిమీద ఒకరు అప్పర్ హ్యాండ్ సాధించటం వంటి బ్రిలియంట్ మైండ్ గేమ్ లో ఇద్దరూ ఒకరికొకరు తీసిపోనట్లుగా నటించి యాక్టింగ్ లో  కొత్త పోకడలు ప్రదర్శించిన వైనం సింప్లీ సూపర్బ్.


అయితే లెంగ్త్ అండ్ క్యారెక్టర్ సెంట్రలైజేషన్ దృష్ట్యా రెజీనా పాత్ర ప్రాధాన్యమున్నది కావడంతోshe steals the show. అయితే సటిల్డ్ అండ్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ విషయంలో అడవి శేషు కొత్త పుంతలు తొక్కుతున్నాడు అనిపిస్తుంది. నటన పరంగానే కాదు పాత్రల ఎంపిక, స్క్రీన్ ప్లే రచన, ఇన్వాల్వ్మెంట్, కేరింగ్ అండ్ ఓనింగ్ ద ప్రాజెక్ట్  వంటి  అన్ని విషయాలలో అడివి శేషు పద్దతి చూస్తుంటే he is going to open New Aveneues to Telugu cinema అనే ఆశాభావం కలుగుతుంది.

ఇక మిగిలిన ఆర్టిస్టుల్లో నవీన్ చంద్ర, మురళి శర్మ పాత్రలు పర్ ఫార్మెన్స్ కు మంచి స్కోప్ ఉన్నవి. వాళ్లు గొప్పగా నటించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా ఈ సినిమాలో ప్రత్యేకంగా మెరిసిన కుర్రాడు నిహాల్. బాలనటుడిగా చాలా మంచి పాత్రలు పోషించిన నిహాల్ ఇందులో ఆచూకీ లేకుండా పోయిన తండ్రి కోసం పరితపించే కుర్రాడిగా ఆదర్శ్ అనే పాత్రలో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

ఇక న్యూ వేవ్, స్టైలిష్ అండ్ కార్పొరేట్ స్టయిల్ ఆఫ్ మేకింగ్ తో ప్రతిష్టాత్మక సంస్థ గా గుర్తింపు పొందిన పి వి పి వారి స్టైలిష్ మేకింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొత్తం మీద “ఎవరు” in all aspects ప్రజెంట్ జనరేషన్ ఫిలిం అనే అభినందనకు డిజర్వ్ అవుతుంది.

It’s worth watching and worth suggesting.

ఎవరు తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • Screen Play
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=bHBZT1V2p0Q]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here