య‌న్టీఆర్ ‘నిండు హృదయాలు’కు 50 ఏళ్ళు

#50YearsForNinduHrudayalu, Latest Telugu Movies News, Nindu Hrudayalu Movie Updates, Nindu Hrudayalu Telugu Movie Latest News, Sr NTR Nindu Hrudayalu Completes 50 Years, Sr NTR Nindu Hrudayalu Movie Completed 50 Years For Today, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
మహానటుడు యన్.టి.రామారావు, కళాతపస్వి కె.విశ్వనాథ్ కలయికలో వచ్చిన చిత్రం ‘నిండు హృదయాలు’. యన్టీఆర్, శోభన్‌బాబు, చలం కథానాయకులుగా న‌టించిన ఈ చిత్రంలో వాణిశ్రీ, గీతాంజలి, చంద్రకళ నాయికలుగా నటించారు. సత్యనారాయణ, రేలంగి, త్యాగరాజు, అల్లు రామలింగయ్య, రుక్మిణి, మిక్కిలినేని, ఛాయాదేవి త‌దిత‌రులు ఇతర ముఖ్య భూమికలు పోషించిన ఈ చిత్రాన్ని ఎస్.వి.ఎస్.ఫిలిమ్స్ పతాకంపై ఎం.జగన్నాథరావు నిర్మించారు. సి.నారాయణరెడ్డి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, సముద్రాల జూనియర్, కె.విశ్వనాథ్‌ రచించిన గీతాలకు… యన్టీఆర్ ఆస్థాన సంగీత దర్శకుడు టి.వి.రాజు స్వరాలు స‌మ‌కూర్చారు. రాజు సంగీత‌సార‌థ్యంలో రూపొందిన పాటల్లో “రామలాలి మేఘ శ్యామలాలి”, “అద్దం లాంటి చెక్కిలి చూసి”, “లే ప్రియా”, “మెత్త మెత్తని సొగసు”, “ఒకటి రెండు మూడు” విశేషాదరణ పొందాయి. 1969 ఆగస్టు 15న విడుదలై విజ‌యం సాధించిన ‘నిండు హృదయాలు’… నేటితో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=P4EPMfEW_jI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − 2 =