2019 బాలీవుడ్ టాప్ 10లో నంబ‌ర్ వ‌న్ మూవీగా ‘కబీర్ సింగ్’

2019 Latest Telugu Film News, Kabir Singh to Stand Out in Top 10 Movies in Bollywood, Shahid Kapoor's Kabir Singh becomes seventh Bollywood venture,Top 10 Movies in Bollywood, Kabir Singh Movie Latest News, Kabir Singh in Top 10 BollyWood Movies, Kabir Singh Hindi Movie, Blockbuster Hit Kabir Singh, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

షాహిద్ కపూర్, కియారా అద్వాని జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘కబీర్ సింగ్’. తెలుగునాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్ వెర్ష‌న్‌గా రూపొందిన ‘కబీర్ సింగ్’… బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా వ‌సూళ్ళ కుంభ‌వృష్టి కురిపించింది. అంతేకాదు… మొద‌టి ఆట నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్… 2019కి గానూ (తొలి 7 నెలల్లో) బాలీవుడ్ టాప్ 10 గ్రాసర్స్‌లో తొలి స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇక ‘కబీర్ సింగ్’ తరువాత స్థానాల‌లో ‘ఉరి’, ‘భారత్’, ‘కేసరి’, ‘టోటల్ ఢ‌మాల్’, ‘సూపర్ 30’, ‘గల్లీబాయ్’, ‘దే దే ప్యార్ దే’, ‘మణికర్ణిక’, ‘లుకా చుప్పి’ నిలిచాయి. మొత్తానికి… `అర్జున్ రెడ్డి` క‌థాంశం తెలుగునాటే కాదు బాలీవుడ్‌లోనూ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌చింద‌న్న‌మాట‌.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here