బ్యాంకాక్‌లో బాల‌య్య మూవీ ఫ‌స్ట్ షెడ్యూల్?

2019 Latest Telugu Movie News, Balakrishna And KS RaviKumar Movie First Schedule Updates, Balakrishna First Shooting Shooting schedule in Bangkok, Balakrishna latest movie news, Balakrishna Shooting Schedule updates, Balakrishna Upcoming Movie Shooting Details, Director RaviKumar With Balakrishna Movie First Schedule Updates, Latest Updates on Balakrishna And KS RaviKumar New Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Balakrishna And KS RaviKumar Movie First Schedule Updates

నటసింహ నందమూరి బాలకృష్ణ, ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా తెరకెక్క‌నున్న విషయం తెలిసిందే. పవర్ ప్యాక్డ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో… పోలీస్ ఆఫీస‌ర్‌గానూ, గ్యాంగ్‌స్ట‌ర్‌గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాల‌య్య కనిపించనున్నట్టు సమాచారం. కాగా… ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్‌ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఆగస్టు 7 నుంచి బ్యాంకాక్‌లో తొలి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాయకానాయికలపై ఓ పాటను చిత్రీకరించనున్నారని టాక్. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ స్వరాలు సమకూరుస్తున్నాడు. కాగా… బాలయ్య కెరీర్‌లో 105వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా… 2020 సమ్మర్‌కి విడుదల కానుందని సమాచారం.

[subscribe]

[youtube_video videoid=-liXVlw8X4s]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + sixteen =