బ్లాక్ బస్టర్ మహర్షి మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు 26 వ మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెం ట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు మూవీ రూపొందనుంది. రష్మిక కథానాయిక కాగా లేడీ అమితాబ్ విజయ శాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సరిలేరు నీకెవ్వరు మూవీ రెగ్యులర్ షూటింగ్ కాశ్మీర్ లో జులై 5వ తేదీ ప్రారంభం కానుంది. మహేష్ బాబు ఆర్మీ మాన్ గా ఒక స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్ ను కాశ్మీర్ లో చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్ కు ఇటలీ స్టంట్ డైరెక్టర్స్ టీమ్ ను చిత్ర నిర్మాతలు ఎంపిక చేశారు. ఇటలీ స్టంట్ డైరెక్టర్స్ టీమ్ పర్యవేక్షణలో మహేష్ బాబు ట్రైనింగ్ పొందుతున్నారు. ఒక వారం రోజుల తరువాత మహేష్ బాబు కాశ్మీర్ వెళతారు. సరిలేరు నీకెవ్వరు మూవీ కాశ్మీర్ షూటింగ్ షెడ్యూల్ రెండు వారాలు జరుగుతుందని సమాచారం.
[youtube_video videoid=AsZx6AQIsqM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: