కళ్యాణ్ రామ్ కు మెహ్రీన్ గ్రీన్ సిగ్నల్

Mehreen To Pair Up With Kalyan Ram

సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కొంత మంది హీరోయిన్లకు మాత్రం వరుస ఆఫర్లు వస్తూనే ఉంటాయి. అలాంటి కోవలోనే వస్తుంది అందాల భామ మెహ్రీన్. ఈ భామకు సరైన హిట్లు లేకపోయినా వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవలే ఈ భామకు ఎఫ్ 2 తో మంచి హిట్ దక్కింది. దీంతో ‘ఎఫ్ 2’ సినిమా సూపర్ హిట్ కావడంతో మరింత బిజీగా తయారైంది మెహ్రీన్. తనకు వచ్చిన అవకాశాల్లో నుంచి తనకి నచ్చినవాటికి మాత్రమే సిగ్నల్ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె కల్యాణ్ రామ్ తో జోడీ కట్టడానికి ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గా 118 తో మంచి హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ కూడా కథలు ఎంచుకునే విషయంలో ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే.. వేణు మల్లిడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్.. వేణు మల్లిడి దర్శకత్వంలో ‘తుగ్లక్’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ఆయన సతీశ్ వేగేశ్నతో కలిసి సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకే మెహ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

కాగా ఇప్పటివరకూ సతీశ్ వేగేశ్న ‘శతమానం భవతి’ .. ‘ శ్రీనివాస కల్యాణం’ వంటి కుటుంబ కథాచిత్రాలనే తెరకెక్కించారు. ఇప్పుడు యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారట. మరి ఈ సినిమాతో ఈ ఇద్దరూ మళ్లీ హిట్ కొడతారేమో చూద్దాం…

[subscribe]

[youtube_video videoid=CKNI3C182NU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + thirteen =