హిప్పీ తెలుగు మూవీ రివ్యూ

Hippi Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Moie Reviews,Hippi Movie Review,Hippi Review,#HippiReview,Hippi Movie Review and Rating,Hippi Movie Story,Hippi Movie Plus Points,Hippi Movie Live Updates,Hippi Movie Public Talk,Hippi Movie Public Response
Hippi Telugu Movie Review

ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు కార్తికేయ. ఈ క్రేజ్ తోనో తన రెండో హిప్పీ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. టిఎన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈసినిమా ఈరోజు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అభిమానుల అంచనాలను కార్తికేయ అందుకున్నాడా?లేదా?అన్న విషయం తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

నటీనటులు : కార్తికేయ, దిగంగా సూర్యవంశీ, జాబ్జా సింగ్, జెడి చక్రవర్తి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం : టిఎన్ కృష్ణ
నిర్మాత : కలై పులి. థాను
సంగీతం : నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రఫర్ : ఆర్ డి రాజేష్
ఎడిటర్ : ప్రవీణ్ కె ఎల్

కథ:

ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన హిప్పీ దేవ‌దాస్ అలియాస్ దేవ్ (కార్తికేయ‌) సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ తన ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఉద్యోగం చేస్తూనే మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటాడు దేవ్. ఆ సమయంలోనే స్నేహ (జజ్బాసింగ్) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. స్నేహతో ప్రేమలో ఉండగానే స్నేహ ఫ్రెండ్ ఆమూక్తమాల్యద(దిగంగన సూర్యవంశీ) ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెను పడేయటానికి నానా కష్టాలు పడతాడు. ఇక ఇదంతా చూసిన స్నేహ దేవ్ కు తన మీద ఉన్నది ప్రేమ కాదు ఎట్రాక్షన్ అని అర్థం చేసుకొని.. వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. ఆ తరువాత ఆముక్తమాల్యద, దేవ్ ప్రేమను ఒప్పుకుంటుంది. కానీ కొన్ని షరతులు పెడుతుంది. ఆ తరువాత ఆముక్తమాల్యద తన ఆంక్షలతో హిప్పీకి నరకం చూపిస్తుంది. అలా వారిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనల తరువాత ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు వస్తాయి. దీంతో దేవ్ ఆమూక్తమాల్యదను వదిలించుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో వారి మధ్యన ఆనంద్ ( జేడీ చక్రవర్తి) ఎలాంటి పాత్రను పోషించాడు ? చివరికు వాళ్లిద్దరూ మళ్లీ కలిసారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

అమ్మాయి కోసం అబ్బాయి వెంటపడటం.. ఆమెను పడేయడం కోసం ఒక అబ్బాయి పడే కష్టాలు.. ఇక్కడి వరకే బాాగానే ఉంటుంది. ఎప్పుడైతే అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడుతుందో అప్పుడే అసలైన సమస్య మొదలవుతుంది. ప్రేమలో పడిన తరువాత అమ్మాయి పెట్టే షరతులకు అబ్బాయి చూపించే అసహనం.. వాళ్లలో మొదలయ్యే ఫ్రస్టేషన్ ఇలా పలు కోణాలను తీసుకొని.. ఆ ద‌శ‌లో ప్రేమ‌ని అర్థం చేసుకోవడ‌మే ముఖ్యం అన్న విష‌యాన్ని దర్శకుడు త‌నదైన శైలిలో చెప్పాడు.

ఇక డైరెక్టర్ టీఎన్ కృష్ణ తీసుకున్న లైన్ పాతదే అయినా దానికి ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టుగా కాస్త హంగులు జోడించి ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు చూపే ప్రయత్నం చేశాడు. ఒక చిన్న అంశాన్ని ఎంచుకొని, దాన్ని క‌థ‌గా మ‌లిచే ప్రయ‌త్నం చేశాడు ద‌ర్శకుడు కృష్ణ. అయితే కథా కథనాలు ఇంకా బలంగా ఉంటే బావుండేది. కానీ థీమ్ తో పాటు సినిమాలో యూత్ కి నచ్చే ఎలిమెంట్స్, కార్తికేయ నటన, కొన్ని డైలాగ్ లు సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. సెకండాఫ్ కొంత ట్రిమ్ చేసి ఉండే బావుండేది.

ఆర్ఎక్స్ 100 సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న కార్తికేయ.. ఈ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో చూసిన కార్తికేయకు.. ఈసినిమాలో చూసిన కార్తికేయకు ఎక్కడా సంబంధం ఉండదు. ఆ సినిమాలో కేవలం ఒక్క ఎక్స్ ప్రెషన్స్ కే అవకాశం ఉండగా.. ఈ సినిమాలో మాత్రం పలు వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కింది. లుక్స్‌ తో పాటు నటనకు కూడా కార్తికేయకు మంచి మార్కులు పడ్డాయి. యాక్షన్‌ సీన్స్‌లో సూపర్బ్ అనిపించాడు. ముఖ్యంగా బాక్సింగ్ సీన్ లో, ప్రీ క్లైమాక్స్ లో చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్‌ దిగంగనా సూర్యవంశీ.. ఆముక్తమాల్యద పాత్రలో ఒదిగిపోయింది.

ఇక చాలా గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇచ్చిన జేడీ చక్రవర్తి, తన అనుభవంతో అరవింద్‌ పాత్రను అవలీలగా పోషించాడు. తెలంగాణ యాసలో జేడీ చక్రవర్తి చెప్పిన డైలాగ్స్ యూత్ ను బాగా అలరిస్తాయి. ఇక వెన్నెల కిషోర్ ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. మరో హీరోయిన్ జజ్బా సింగ్, బ్రహ్మాజీ, సుదర్శన్‌ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

ఆర్ డి రాజేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. గోవాలో వచ్చే దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు నివాస్ కె ప్రసన్న అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. ప్రవీణ్ కె ఎల్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాత కలైపులి ఎస్ థాను ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

* కార్తికేయ, దిగంగన నటన
* యాక్షన్ ఎపిసోడ్స్
* యూత్ ను ఆకట్టుకునే కొన్ని అంశాలు

మైనస్ పాయింట్స్

* కథ కథనం
* స్క్రీన్ ప్లే

ఓవరాల్ గా చెప్పాలంటే ఇది యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతవరకూ నచ్చుతుందో చూద్దాం..

హిప్పీ తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • ScreenPlay
  • Direction
  • Performance
3.3
Sending
User Review
0 (0 votes)
Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here