చాలా కాలంగా వరుస పరాజయాలతో కెరీర్ లో కాస్త వెనుకబడిన అల్లరి నరేష్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మహర్షి లాంటి సినిమాలో శివ అనే ఓ కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. మహేష్ స్నేహితుడిగా ఈ సినిమాలో అల్లరి నరేష్ అమాయకత్వంతో కూడిన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు మహేష్ బాబు పాత్ర ఎంత హైలెట్ గా నిలిచిందో.. నరేష్ పాత్ర కూడా అంతే హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతో నరేష్ కు మంచి గుర్తింపు రావడంతో పాటు.. అవకాశాలు కూడా క్యూ కట్టాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘డిస్కో రాజా’ చిత్రంలో నరేశ్ కు కీలక పాత్రలో నటించే అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. మొదట ఈ పాత్ర కోసం సునీల్‌ను ఎంపికచేసుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర నరేశ్‌కు దక్కినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=rkgIK9xsXBY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: