బిజీ బిజీగా ‘ఛలో’ భామ‌

Rashmika Mandanna Gets Busy With Her Upcoming Projects,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Rashmika Mandanna Upcoming Films,Actress Rashmika Next Film Updates,Rashmika Mandanna Busy With Crazy Movies,Rashmika Mandanna Next Project Details
Rashmika Mandanna Gets Busy With Her Upcoming Projects

రష్మిక మందన్న… ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్‌లో తొలి అడుగులు వేసిన‌ కన్నడ బ్యూటీ. తొలి సినిమాతోనే ఘ‌న విజయాన్ని అందుకున్న ఈ భామ… త‌న సెకండ్ తెలుగు ఫిల్మ్ ‘గీత గోవిందం’తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అన‌తికాలంలోనే ద‌క్షిణాదిన‌ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకున్న రష్మిక… ప్ర‌స్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… తాజాగా యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ‘డియర్ కామ్రేడ్’లో హీరోయిన్‌గా నటించింది ర‌ష్మిక‌. క్రికెటర్ పాత్ర‌లో ర‌ష్మిక‌ దర్శనమివ్వనున్న ఈ చిత్రం జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు… సూపర్ స్టార్ మహేష్ బాబు, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రంలోనూ… అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రానున్న సినిమాలోనూ ర‌ష్మిక‌కి హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం ద‌క్కింద‌ని స‌మాచారం. అంతేకాదు… తన తొలి చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందనున్న ‘భీష్మ’లో నితిన్‌కు జంట‌గా న‌టిస్తోంది ర‌ష్మిక‌.

ఇలా కేవలం తెలుగు ప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా… కోలీవుడ్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది ఈ భామ. ఇప్పటికే కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక… తాజాగా కోలీవుడ్ తలపతి విజయ్ సరసన కథానాయికగా నటించే అవకాశం కూడా దక్కించుకున్నట్టు కోలీవుడ్ టాక్‌. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో… రష్మిక ఎంట్రీపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక త‌న మాతృభాష కన్నడంలోనూ మరో రెండు పెద్ద సినిమాల‌ను లైన్‌లో పెట్టింద‌ట ర‌ష్మిక‌. మొత్త‌మ్మీద‌… వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న రష్మిక… ఆ యా చిత్రాల‌తో ఏ స్థాయి విజయాలను నమోదు చేస్తుందో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=2JvYPnvDxQk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =