`బ్రేక‌ప్‌` చెబుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ?

Interesting Title For Vijay Deverakonda New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijay Deverakonda Races Through Projects Starts Shoot For His Next,Vijay Deverakonda Busy With His Upcoming Films,Vijay Deverakonda Next Movie Title Plans as Breakup,Hero Vijay Deverakonda Next Movie Title Breakup
Interesting Title For Vijay Deverakonda New Movie

ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే.. మరో సినిమాను లైన్‌లో పెడుతూ వరుస చిత్రాల‌తో బిజీగా మారుతున్నాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం.. ఈ టాలెంటెడ్ హీరో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు టాలీవుడ్ టాక్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే.. కథానుసారం ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి ‘బ్రేకప్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని తెలుస్తోంది. ట్ర‌యాంగిల్‌ లవ్ స్టొరీగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌కి పలు బ్రేకప్ లవ్ స్టోరీస్ ఉంటాయట. అందుకే ఈ టైటిల్ అయితేనే యాప్ట్ అని చిత్ర బృందం భావిస్తున్నట్టుగా సమాచారం. త్వ‌ర‌లోనే ‘బ్రేకప్’ టైటిల్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

కాగా.. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ జూలై 26న విడుదల కానున్న విష‌యం తెలిసిందే.

[subscribe]

[youtube_video videoid=MFQv_mS6icI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =