ప్ర‌భాస్‌‘డార్లింగ్’కు 9 ఏళ్ళు

9 Years For Prabhas Super Hit Movie Darling,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,9 Years For Prabhas Darling Movie,9 Years Turns For Prabhas Darling Movie,Darling Movie Completes 9 Years,Prabhas Darling Movie Latest Updates,9 Years of Darling Movie
9 Years For Prabhas Super Hit Movie Darling

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథలను ఎంచుకోవడం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేకత. అలా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా అలరించిన ప్ర‌భాస్ చిత్రాలలో ‘డార్లింగ్’ ఒకటి. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ ఎ.కరుణాకరన్ తెరకెక్కించాడు. ప్రభాస్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రంలో… ప్రభు, ‘ఆహుతి’ ప్రసాద్, చంద్రమోహన్, తులసి, శ్రద్ధా దాస్ తదితరులు ఇతర భూమికలను పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జి.వి.ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ శ్రోతలను అలరించాయి. ముఖ్యంగా “ఇంకా ఏదో”, “నీవే” పాటలు ఎవ‌ర్‌గ్రీన్‌ సాంగ్స్‌గా నిలిచిపోయాయి. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం… బెస్ట్ ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావుకు, బెస్ట్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ (మేల్)గా ఆర్.సి.ఎం.రాజుకు నంది అవార్డులను సంపాదించి పెట్టింది. అంతేకాదు… ఈ సినిమాని కన్నడంలో ‘బుల్‌బుల్’ పేరుతో పునఃనిర్మించారు. 2010 ఏప్రిల్ 23న విడుదలైన ‘డార్లింగ్’… నేటితో 9 వసంతాలను పూర్తి చేసుకుంది.

[subscribe]


[youtube_video videoid=e39EebWvqFA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 13 =