సినీ ఇండస్ట్రీలో సెంటి మెంట్లు ఉండటం కామన్ థింగే. ఈ విషయం అందరికీ తెలిసిందే. సినిమా ప్రారంభానికి ముహూర్తం.. సినిమా రిలీజ్ కు ముహూర్తం.. ఇలా సినిమా మొదలైన దగ్గర నుండి… సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ అన్నీ ముహూర్తాలే చూసుకొని మరీ రిలీజ్ చేస్తుంటారు. ఇక డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు ఇలా ప్రతి ఒక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఇక ఈ సెంటిమెంట్ల నేపథ్యంలోనే కొంత మంది పేర్లు కూడా మార్చుకుంటారు. చిరంజీవి దగ్గర నుండి పలువురు టాప్ హీరోలు.. టాప్ హీరోయిన్లే తమ పేర్లు మార్చుకొని సినీ ఇండస్ట్రీని ఏలిన వారు ఉన్నారు. అలా ఈమధ్య కాలంలో పేరు మార్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో.. మెగా సుప్రీమ్ హీరో.. మెగా మేనల్లుడు సాయితేజ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాయి థరమ్ తేజ్ గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ్ మొదట మంచి ఫలితాలే దక్కించుకున్నాడు. ఇక ఆతరువాత తిక్క నుండి ఈ హీరోకు సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఇప్పుడు చిత్రలహరి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా మాత్రం తేజ్ కు మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో టాక్ కూడా వినిపిస్తుంది. నిజానికి ఇన్ని రోజులు సాయి థరమ్ తేజ్ గా ఉన్న తేజ్ ఈ సినిమాతో సాయి తేజ్ గా తన పేరును మార్చుకున్నారు. దీంతో తేజ్ పేరు మార్చుకోవడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చిందన్న టాక్స్ వినిపిస్తున్నాయి.
మరి ఏది ఏమైనా ఇన్ని రోజులు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న తేజ్ కు చిత్రలహరి సినిమా మంచి హిట్ ఇచ్చి ఊరటనిచ్చింది. ఇక ముందు ముందు కూడా ఇలానే మంచి సినిమాలు తీస్తూ… కెరీర్ లో దూసుకుపోవాలని ఆశిద్దాం..
[subscribe]
[youtube_video videoid=gIQHYdck5Dk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: