మొత్తానికి మెగా మేనల్లుడు సాయి తేజుకు చిత్రలహరి సినిమాతో కాస్త రిలీఫ్ దొరికింది. తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు వరుసగా 6 ఫ్లాపులతో సరైన హిట్ లేక సతమతమవుతున్న సాయి తేజ్ కు చిత్రలహరి హిట్ తెచ్చిపెట్టింది. ఇక మంచి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతుంది. ఫస్ట్ వీకెండ్ లో కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోదాదాపు 8 కోట్లుకు పైగా వసూళ్లు చేసింది. దీంతో వారంలోనే చిత్రలహరి బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చేపెట్టేలా కనిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 4రోజుల్లో 20కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో బయ్యర్ల పెట్టుబడిలో 80శాతం వెనక్కు తెచ్చింది. ఓవర్సీలో కూడా మంచి కలెక్షన్స్ వచ్చినట్టయితే ఈ పాటికే లాభాల బాట పట్టేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి జెర్సీ సినిమాకు మరో మూడు రోజులు టైం ఉంది కాబట్టి ఆలోపు రావాల్సిన కలెక్షన్లు వచ్చేస్తాయంటున్నారు.
కాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ కథానాయికలు కాగా ముఖ్య పాత్రలలో సునీల్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి నటించారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
[subscribe]
[youtube_video videoid=gIQHYdck5Dk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: