అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’కు 5 ఏళ్ళు

Arjun Arjun Race Gurram Turns 5 years Old Today,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Race Gurram Movie Completes 5 years,5 years For Allu Arjun Race Gurram Movie,Arjun Arjun Race Gurram Movie Latest Updates,5 years For Race Gurram
Arjun Arjun Race Gurram Turns 5 years Old Today

అన్నదమ్ముల సెంటిమెంట్ తో తెరకెక్కిన చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే… టామ్ అండ్ జెర్రీ లా నిత్యం కొట్టుకుంటూ ఉండే అన్నదమ్ముల మధ్య అంతర్లీనంగా సెంటిమెంట్ ను చూపిస్తూ… దాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రం మాత్రం ‘రేసుగుర్రం’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, శ్యామ్ అన్నదమ్ములుగా నటించగా… శ్రుతి హాసన్, సలోని, ప్రకాష్ రాజ్, రవికిషన్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బన్నీని తొలిసారి డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి… బన్నీ ఎనర్జీకి తగ్గ కథను రాసుకోవడంలో నూటికి నూరు శాతం విజయం సాధించాడు.

అలాగే… సురేందర్ రెడ్డికి బాగా కలిసొచ్చిన సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాతో తొలిసారిగా బన్నీ కోసం స్వరాలను సమకూర్చడం విశేషం. ముఖ్యంగా “సినిమా చూపిస్త మావా” అనే పాట అయితే మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరిని ఒక ఊపు ఊపేసింది. ఇక ప్రకాష్ రాజ్, శ్రుతి హాసన్ మధ్య వచ్చే ఎమోషన్ లెస్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు… ఫ్రస్ట్రేషన్ అంటూ కిల్ బిల్ పాండే పాత్రలో బ్రహ్మానందం చేసే కామెడీ ప్రతీ ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తుంది. అటు బన్నీ ఫాన్స్ తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకున్న ‘రేసుగుర్రం’ ఏప్రిల్ 11, 2014లో విడుదలై… నేటితో 5 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here