టి. కుమార రాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సూపర్ డీలక్స్. టీజర్, ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఈ రోజు రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలకు తగ్గట్టుగానే ఈసినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో ఒక్కొక్కరూ ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్లో నటించారు. అవే ముఖ్యంగా సినిమా ప్రధాన బలంగా మారినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా శిల్పా అనే హిజ్రా పాత్రలో విజయ్ సేతుపతి నటించడం. ఈ పాత్రలో నటించిన విజయసేతుపతి నటించడం కాదు.. జీవించాడని చెప్పొచ్చు. ఇక రమ్యకృష్ణ అయితే మొదటి సారి వేశ్య పాత్రలో నటించింది. ఏ పాత్ర చేసినా అందులో పరకాయ ప్రవేశం చేసే రమ్యకృష్ణ ఈ సినిమాలోకూడా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అందరినీ ఆకట్టుకుంది. ఇక సమంత పాత్ర గురించి సినిమా రిలీజ్ కు ముందు తెలీదు… కానీ సినిమా చూసిన తరువాత మాత్రం సమంత పాత్ర చూసి అందరూ షాకవుతున్నారు. పెళ్లయిన తరువాత హీరోయిన్స్ కెరీర్ క్లోజ్ అవుతుంది అనే ట్యాగ్ ను తీసిపారేసిన సమంత అక్కినేని వారి కోడలు అయ్యాక ప్రయోగాత్మక సినిమాలతో మరింత జోరు పెంచింది. పెళ్లయినా కూడా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని భర్తను చంపే మహిళగా సమంత నటన పీక్స్ అని చెప్పొచ్చు. సమంత తన పాత్రకు న్యాయం చేసింది.
సూపర్ డీలక్స్ సినిమాలో ఉన్న కంటెంటే ఈ సినిమాకు మరో ప్రధాన బలం. కుమార రాజా ఒక పాత్ బ్రేకింగ్ సినిమాను తీశారని చెప్పొచ్చు. అటు బోల్డ్ కంటెంట్ పాతు ఇటు జీవితం విలువను చెప్పడంలో.. మనిషి జీవితంలో ఉండే మరో డార్క్ సైడ్ ను చూపించడంలో సక్సెస్ అయ్యాడు. తాను సెలక్ట్ చేసుకున్న లొకేషన్స్ కానీ.. కథ కానీ రియల్ లైఫ్ కు దగ్గర ఉండటమే ఈ సినిమా విజయానికి మరో కారణం. ఇక యువన్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజయసేతుపతి అర్పుతమ్(మిస్కిన్)ను కలవడం జరగకపోతే అసలు ఈ సినిమా ఇంత వర్కవుట్ అయి ఉండేది కాదేమో. మొత్తానికి ఈ సినిమా తమిళ్ లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరి తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారేమో చూద్దాం…
[youtube_video videoid=3-Xq_Zz3nPA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: