అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టారర్ ‘ఎఫ్2’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి విన్నర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరి మన్ననలు పొందింది. అంతేకాదు ప్రస్టేషన్, అంతేగా అంతేగా అనే డైలాగ్స్ మోస్ట్ పాపులర్ డైలాగ్స్ లిస్ట్ లో చేరాయి. ఇక ఈ సినిమా కలెక్షన్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు.. అటు వెంకీ, వరుణ్ కు ముగ్గురికీ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా ఇఫ్పుడు బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతుంది. ఈ సినిమా రీమేక్ హక్కులు బోనీకపూర్ దక్కించుకున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనీస్ బజ్మీ దర్శకత్వం వహించనున్నాడు. అనీస్ బజ్మీ గతంలో తెలుగులో విజయవంతమైన పెళ్లాం ఊరెళితే సినిమాను ‘నో ఎంట్రీ’గా.. ‘రెడీ’ సినిమాను సల్మాన్ ఖాన్, అసిన్ జంటగా రీమేక్ చేశారు. ఇప్పుడు ‘ఎఫ్2’ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. త్వరలో ఈ సినిమాలో నటించబోయే నటీనటుల గురించి వెల్లడించనున్నారు. మరి ఇక్కడ సూపర్ హిట్టయిన సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందో చూద్దాం.
[youtube_video videoid=bPHYrP8kHvw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: