ప్రణీత్ బ్రమందపల్లి దర్శకత్వంలో నిహారిక, రాహుల్ విజయ్, పర్లీన్ బసానియా ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం సూర్యకాంతం. నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి టీజర్, ట్రైలర్ తో అంచనాలను పెంచేసిన సూర్యకాంతం… ఆ అంచనాలను రీచ్ అయిందా? లేదా? ఈ సినిమాతో నిహారిక సక్సెస్ ను అందుకుంటుందా?లేదా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు: నిహారిక , రాహుల్ విజయ్, పర్లీన్ బసానియా
దర్శకత్వం: ప్రణీత్
నిర్మాత : సందీప్
సంగీతం : మార్క్ కె రాబిన్
కథ :
సూర్యకాంతం (నిహారిక) చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి దగ్గర పెరుగుతుంది. ఇక తల్లి గారబంతో తాను ఏది చేయాలనుకుంటే అది చేస్తూ… క్రేజీ అమ్మాయిగా తయారవుతుంది. ఇక సూర్యకాంతం క్యారెక్టర్ నచ్చిన అభి ( రాహుల్ విజయ్ ) ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఈ క్రమంలో సూర్యకాంతం కూడా అభిని ఇష్టపడుతుంది. అయితే ఇంతలో సూర్యకాంతం అమ్మ సుహాసిని చనిపోతుంది. దాంతో డిప్రెషన్ కు గురై సూర్యకాంతం, అభి కి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక ఈ గ్యాప్ లో అభి మరో అమ్మాయి పూజ ( పర్లీన్ బసానియా) ప్రేమలో పడతాడు. వాళ్లిద్దరి ప్రేమకు ఇంట్లో వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంటారు. ఇంతలో మళ్లీ సూర్యకాంతం అభి జీవితంలోకి వస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది..? సూర్యకాంతం అభి ప్రేమని ఒప్పుకుందా ? లేదా ? అభి ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఈ విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
విశ్లేషణ:
ఇప్పటివరకూ మనం ఎన్నో ట్రయాంగిల్ స్టోరీస్ చూసేఉంటాం. ఈ సూర్యకాంతం కూడా ఆ కోవలోకి చెందినదే. పాత లైన్ నే తీసుకొని కాస్త కొత్తగా చూపించడానికి ట్రై చేశాడు డైరెక్టర్. ట్రయాంగిల్ లవ్ స్టొరీ ని బాగానే హ్యాండిల్ చేసాడు. అక్కడక్కడా కాస్త తడబడినా కూడా క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం మాత్రం బాగుంది.
ఇక ఈసినిమాకు ప్రధానం బలం నిహారిక. ఒక మనసు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన నిహారికకు ఆ సినిమా చేదు అనుభవమే మిగిల్చింది అని చెప్పొచ్చు. ఆ తరువాత వచ్చిన హ్యాపీ వెడ్డింగ్ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. నిజానికి బయట నిహారిక చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. కానీ తాను చేసిన రెండు సినిమాలు మాత్రం చాలా సైలెంట్ క్యారెక్టర్సే. ఈ సారి మాత్రం నిహారిక ఆ తప్పు చేయకుండా.. తన రియల్ క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టు పాత్రను ఎంచుకుంది. సూర్యకాంతం పాత్రలో నిహారిక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తన క్యారెక్టర్ లో ఒదిగిపోయి తన పాత్రకు న్యాయం చేసింది. ప్రెజెంట్ జనరేషన్‌లో అమ్మాయిలు ఎలా ఉంటారో ఆ క్యారెక్టర్‌లో చక్కగా చేసింది.
ఇక అభి పాత్రలో రాహుల్ విజయ్ రాణించాడు. మొదటి సినిమా అయినా కూడా చాలా అనుభవం ఉన్న హీరోలాగానే చేసి మంచి మార్కులే కొట్టేశాడు. ఇద్దరి అమ్మయిల మధ్య నలిగిపోయే లవర్ గా డీసెంట్ గా నటించాడు. ఇక పర్లీన్ కు కూడా మంచి పాత్ర లభించింది. తాను కూడా తన నటనతో ఆకట్టుకుంది. తనకు కూడా ఇదే మొదటి సినిమా అయినా అనుభవం వున్నా నటి లా బాగా నటించింది. ఇక మిగిలిన పాత్రల్లో సత్య , శివాజీరాజా , సుహాసిని, తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేశారు.
విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. మార్క్ రాబిన్ అందించిన సంగీతం పరవాలేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా వుంది. సినిమాటోగ్రఫీ బాగుంది.
ప్లస్ పాయింట్స్
నిహారిక నటన
మైనస్ పాయింట్స్
కథ,కథనం
అక్కడక్కడ కొన్ని సాగతీత సన్నివేశాలు
[wp-review id=”18010″]
[youtube_video videoid=nEBGu3Lqv2A]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: