ఆరేళ్ళ త‌రువాత‌… రీమేక్‌లో రామ్‌?

Latest Telugu Movies News, Ram Pothineni Latest News, Ram Pothineni New Movie Updates, Ram Pothineni Next Film News, Ram Pothineni Next Project Details, Ram Pothineni To Remake A Movie After 6 Years, Ram Pothineni Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Ram Pothineni To Remake A Movie After 6 Years

క‌థానాయ‌కుడిగా ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌ది 13 ఏళ్ళ న‌ట‌ప్ర‌స్థానం. ఇప్ప‌టివ‌ర‌కు 16 సినిమాల‌తో వెండితెర‌పై సంద‌డి చేశాడు ఈ యంగ్ హీరో. ప్ర‌స్తుతం 17వ చిత్రంగా `ఇస్మార్ట్ శంక‌ర్‌` చేస్తున్నాడు. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతమందిస్తున్నాడు. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌… వేస‌వి కానుక‌గా మే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే… ఈ సినిమా త‌రువాత రామ్ న‌టించ‌బోయే ప్రాజెక్ట్‌పై ఆస‌క్తిక‌ర‌మైన వార్త వినిపిస్తోంది. అదేమిటంటే… తాజాగా విడుద‌లైన త‌మిళ చిత్రం `త‌డ‌మ్‌` (అరుణ్ విజ‌య్ హీరో)కి సంబంధించిన రీమేక్ రైట్స్‌ను రామ్ పెద‌నాన్న`స్ర‌వంతి` ర‌వికిశోర్‌, `ఠాగూర్‌` మ‌ధు ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేశారని… ఈ సినిమాలో రామ్ హీరోగా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి… ఇందులో ఎంత నిజముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది. కాగా… రామ్ కెరీర్ మొత్త‌మ్మీద ఇప్ప‌టివ‌ర‌కు ఒకే ఒక రీమేక్ సినిమాలో న‌టించాడు. ఆ చిత్ర‌మే `మ‌సాలా`. ఆ త‌రువాత మ‌ళ్ళీ రీమేక్‌ల జోలికి వెళ్ళ‌ని రామ్‌… మ‌రి `త‌డ‌మ్‌`తో ఆరేళ్ళ త‌రువాత మ‌రో ప్ర‌య‌త్నం చేస్తాడో లేదో చూడాలి.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here