`వెంకీ మామ‌`లో పాయ‌ల్ రాజ్‌పుత్‌?

Payal Rajput To Act In Venky Mama?Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Payal Rajput in Venky Mama Movie,Actress Payal Rajput Role in Venky Mama Movie,Venky Mama Movie Latest Updates,Payal Rajput New Movie News
Payal Rajput To Act In Venky Mama?

`ఆర్ ఎక్స్ 100`తో టాలీవుడ్‌లో సెన్సేష‌నల్ ఎంట్రీ ఇచ్చింది ఉత్త‌రాది భామ పాయ‌ల్ రాజ్‌పుత్‌. మొద‌టి సినిమా తెచ్చిన గుర్తింపుని… కాస్తంత ఆల‌స్యంగానైనా అవ‌కాశాలుగా మ‌ల‌చుకుంటోందీ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టికే పాయ‌ల్‌ రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్‌. అంతేకాదు… మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కి జోడీగా `డిస్కో రాజా`లోనూ ఓ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అలాగే… `మ‌న్మ‌థుడు` సీక్వెల్‌లోనూ కింగ్ నాగార్జున ప‌క్క‌న ఓ హీరోయిన్‌గా న‌టించేందుకు ఈ అమ్మ‌డు ఓకే చెప్పింద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే వ‌రుస‌లో మ‌రో సీనియ‌ర్ హీరో ప‌క్క‌నా పాయ‌ల్ సంద‌డి చేయ‌బోతోంద‌ని స‌మాచారం. ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. రీసెంట్‌గా`ఎఫ్ 2`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన విక్ట‌రీ వెంక‌టేష్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త‌న మేన‌ల్లుడు, యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి వెంకీ న‌టిస్తున్న చిత్రం `వెంకీ మామ‌`. ఇందులో చైతూకి జోడీగా ఇప్ప‌టికే ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌న్‌ఫ‌ర్మ్ కాగా.. వెంకీకి జోడీగా న‌టించే నాయిక‌పై ఇప్ప‌టివ‌ర‌కు క్లారిటీ రాలేదు. ఆ మ‌ధ్య హ్యుమా ఖురేషి, శ్రియ పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి. తాజాగా ఈ జాబితాలో పాయ‌ల్ రాజ్‌పుత్ పేరు కూడా చేరింది. త్వ‌ర‌లోనే పాయ‌ల్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

కాగా… ఈ నెల 24న `వెంకీ మామ‌` రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రేలంగి గ్రామంలో 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో… రైస్ మిల్ ఓన‌ర్‌గా క‌నిపించ‌నున్న వెంకీపై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారని తెలుస్తోంది. ఆ త‌రువాత‌ ఏప్రిల్‌లో కాశ్మీర్ షెడ్యూల్ ఉంటుంద‌ని టాక్‌. కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `వెంకీ మామ‌`… ద‌స‌రా కానుక‌గా తెర‌పైకి రానుంది.

[subscribe]

[youtube_video videoid=a8jLt8-NJCI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =