`# బ‌న్నీ-త్రివిక్ర‌మ్ 3`లో మెగాస్టార్ హీరోయిన్‌?

Chiranjeevi Heroine To Play A Key Role in Allu Arjun Trivikram Movie,Nagma To Act in Allu Arjun and Trivikram Movie,Allu Arjun and Trivikram New Movie Updates,Actress Nagma To Play a key Role in Allu Arjun New Film,Nagma Next Project Details,Allu Arjun and Trivikram Movie New Film News
Chiranjeevi Heroine To Play A Key Role in Allu Arjun Trivikram Movie

`జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` వంటి రెండు ఘ‌న‌విజ‌యాల త‌రువాత‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మాత‌లుగా వ్య‌వ‌హరిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభం కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో బ‌న్నీకి తండ్రిగా ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు బొమన్ ఇరాని న‌టిస్తున్నాడ‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం… బ‌న్నీకి త‌ల్లి పాత్ర‌లో సీనియ‌ర్ హీరోయిన్ న‌గ్మా న‌టించ‌బోతుంద‌ని టాలీవుడ్ టాక్‌. అదే గ‌నుక నిజ‌మైతే… మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `ఘరానా మొగుడు`, `ముగ్గురు మొన‌గాళ్ళు`, `రిక్షావోడు` చిత్రాల్లో న‌టించి అల‌రించిన న‌గ్మా… చాలా కాలం గ్యాప్ త‌రువాత మెగా కాంపౌండ్‌లో న‌టించే సినిమా ఇదే అవుతుంది. అంతేకాదు… 17 ఏళ్ళ త‌రువాత తెలుగులో ఆమె న‌టించే సినిమా కూడా ఇదే అవుతుంది. త్వ‌ర‌లోనే న‌గ్మా ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. కాగా… ఈ సినిమాలో బ‌న్నీకి జోడీగా `డీజే` భామ పూజా హెగ్డే క‌న్‌ఫ‌ర్మ్ అయింద‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

[subscribe]

[youtube_video videoid=Qet0IxVPoe8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − four =