ట్యాగ్ · 210 కథనాలు · పేజీ 10
F3 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
యాక్షన్ థ్రిల్లర్ "గద్దలకొండ గణేష్ "

"F 3" మూవీ అప్ డేట్
మిడ్ నైట్ షూట్ లో వరుణ్ తేజ్
చిన్నప్పటి 'గద్దలకొండ గణేష్' - 'రియల్' టు 'రీల్'
సాధారణ పరిస్థితుల కోసం ఎదురుచుస్తున్నా..!

2020 ప్లాన్స్ లాగే ఉంది నా ఫొటో కూడా..!

ముగ్గురు డైరెక్టర్స్ తో వరుణ్ సినిమా..!
వలస కూలీల పై హరీష్ శంకర్ ఆవేదన..!
వరుణ్ తేజ్ ఇన్ స్టా గ్రామ్ లో పవర్ ఫుల్ డైలాగ్

వరుణ్ తేజ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్
తమ్ముడు ఫైనల్లీ తల ఏత్తుకునేలా చేశావ్..!
వరుణ్ తేజ్ 'బాక్సర్' రిలీజ్ అయ్యేది అప్పుడే...!

మరోసారి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జోడీ?

ఏప్రిల్ 3 నుంచి `వరుణ్ తేజ్ 10`... సెకండ్ షెడ్యూల్
'ఎఫ్ 3' గ్రాండ్ లాంచ్
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్నాడు.
F3 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లడమే లేట్.
యాక్షన్ థ్రిల్లర్ "గద్దలకొండ గణేష్ "
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "గద్దలకొండ గణేష్ " మూవీ ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ తమిళ మూవీ "జిగర్తాండ " కు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీ లో అథర్వ , మృణాళిని రవి ముఖ్య పాత్రలలో నటించారు. డింపుల్ హాయతి ఒక స్పెషల్ సాంగ్ లో నటించగా , దర్శకుడు సుకుమార్ , హీరో నితిన్ , స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అతిథి పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

"F 3" మూవీ అప్ డేట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ -తమన్నా , వరుణ్ తేజ్ - మెహరీన్ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్" F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అనిల్ తెరకెక్కించిన " F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ "మూవీ విశేష ప్రేక్షకాదరణ పొందింది. హీరోలు వెంకటేష్ , వరుణ్ తేజ్ తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. " F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ "మూవీ సీక్వెల్ "F 3" మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
మిడ్ నైట్ షూట్ లో వరుణ్ తేజ్
ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా కోసం ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.
డెస్టినేషన్ వెడ్డింగ్ - పెళ్లి పనుల్లో వరుణ్ బిజీ
త్వరలోనే మెగా డాటర్ నిహారిక పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్యతో ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది కూడా. ఇక కొద్దిరోజుల్లో బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్న నేపథ్యంలో నిహారిక బ్యాచిలర్ పార్టీ కూడా జరుపుకుంది. ఇక ఈ నేపథ్యంలో తన కూతురి పెళ్లి గురించి.. పనులు గురించి చెపుతూ చెపుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చిన్నప్పటి 'గద్దలకొండ గణేష్' - 'రియల్' టు 'రీల్'
మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ రూటు కాస్త సెపరేట్. మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. 'ముకుంద' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వరుణ్ మొదట కొన్ని పరాజయాలే అందుకున్నాడు. ఇక ఫిదా సినిమాతో క్లాస్ హిట్ కొట్టిన వరుణ్... తొలిప్రేమ,ఎఫ్2 తో కామెడీ యాంగిల్ ను చూపించాడు..గద్దల కొండ గణేష్ సినిమాతో మాస్ హిట్ కొట్టాడు.
సాధారణ పరిస్థితుల కోసం ఎదురుచుస్తున్నా..!
ప్రస్తుతం అందరి ఆలోచనా ఒకటే.. ఈ కరోనా వైరస్ ప్రభావం ఎప్పుడు తప్పుతుంది.. ఎప్పుడు సాధారణ పరిస్థితులు వస్తాయి అని. సామాన్య ప్రజలనుండి సెలబ్రిటీస్ వరకూ అందరూ ఇదే కోరుకుంటున్నారు. ఇక సినీ సెలబ్రిటీస్ కు అయితే ఒకింత కష్టమే అని చెప్పొచ్చు. ఎప్పుడూ షూటింగ్స్, సినిమాలు, ప్రమోషన్స్ అంటూ బిజీ బిజీగా వుండే వాళ్ళకి ఇన్నిరోజులు ఒకేప్లేస్ లో ఎక్కడికీ వెళ్లకుండా ఉండాలంటే వారికి చాలా కష్టం. ఫ్యామిలీతో కాలక్షేపం చేసిన కొద్దిరోజులు అంటే ఉండగలరు కానీ ఇలా నెలలు నెలలు ఉండాలంటే ఇబ్బందే.

2020 ప్లాన్స్ లాగే ఉంది నా ఫొటో కూడా..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా కామెడీ ట్వీట్స్, పంచ్ డైలాగ్స్ వేస్తూనే ఉంటాడు. ఇక తాజాగా మరోసారి ఆయన తన ట్విట్టర్ ద్వారా 2020 పై కామెడీ ట్వీట్ చేసాడు. నిజానికి కరోనా వల్ల సినీ పరిశ్రమకు బాగానే నష్టం వచ్చింది. దురదృష్టకరమైన అంశం ఏంటంటే షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎవరు షూట్ కు వెళ్ళడానికి రెడీ గా లేకపోవడం. ఎప్పుడెప్పుడు అనుమతులు ఇస్తారా అని అనుమతులు కోసం వెయిట్ చేసిన వాళ్ళే ఇప్పుడు లేట్ అయినా ప్రాబ్లెమ్ లేదు చిన్నగానే షూట్ ను మొదలుపెడదాం అనే నిర్ణయానికి వచ్చేసారు.

ముగ్గురు డైరెక్టర్స్ తో వరుణ్ సినిమా..!
ముగ్గురు డైరెక్టర్స్ తో వరుణ్ సినిమా ఏంటబ్బా అనుకుంటున్నారా..? అవును ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త ఇదే. అసలు సంగతేంటంటే.. వరుణ్ సినిమా కోసం ముగ్గురు డైరెక్టర్స్ పనిచేస్తున్నారట. వాళ్ళు ఎవరో కాదు.. క్రిష్, సురేందర్ రెడ్డి మరియు వక్కంతం వంశీ. అంటే ముగ్గురు కలిసి డైరెక్ట్ చేస్తున్నారా అంటే పప్పులో కాలేసినట్టే. ఈ సినిమాకు క్రిష్ కథను అందిస్తూనే నిర్మిస్తున్నాడట. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ట్నైమెంట్స్ బ్యానర్ పై క్రిష్మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ సినిమాని నిర్మించాలనుకుంటున్నాడట. ఇక దర్శకత్వ బాధ్యతలు సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ స్క్రీన్ ప్లే అందించనున్నాడట. ఇక వరుణ్ వరుణ్ వరుస హిట్స్ తో…
వలస కూలీల పై హరీష్ శంకర్ ఆవేదన..!
కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేదలకు.. రోజు కూలీలు చేసే వారికి సాయం చేస్తూనే వున్నారు. అంతేకాదు పలువురు సినీ, రాజకీయ, క్రీడా కారులు ఇలా చాలా మంది పెద్ద ఎత్తున విరాళాలు చేశారు. సెలబ్రిటీస్ మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉంది. అందరికీ ఏదో ఒకవిధంగా సాయం అందుతూనే వుంది. కానీ వలస కార్మికుల పరిస్థితి మాత్రం వేరు. వారికి బాధ మాత్రం దయనీయం. లాక్ డౌన్ విధించిన వెంటనే చావైనా, బతుకైనా అనుకుని కాలిబాటన వందల, వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వారి…
వరుణ్ తేజ్ ఇన్ స్టా గ్రామ్ లో పవర్ ఫుల్ డైలాగ్
"తొలిప్రేమ ", "ఫిదా "," F 2" వంటి సూపర్ హిట్ మూవీస్ తో వరుణ్ తేజ్ సక్సెస్ ఫుల్ హీరోగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన సక్సెస్ ఫుల్ "గద్దలకొండ గణేష్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి వరుణ్ తేజ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లాక్ డౌన్ సమయంలో వరుణ్ తేజ్ సోషల్ మీడియా లో ఫోటోస్ షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్
బ్లాక్ బస్టర్ "ఫిదా ", "తొలి ప్రేమ ", "F 2", "గద్దలకొండ గణేష్ " మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న #VT10 మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ కై వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. లాక్ డౌన్ కారణంగా మూవీ షూటింగ్ వాయిదా పడింది.

అన్నయ్య ఆ రెండు సినిమాలు రీమేక్ చేయడం వరుణ్ కు పెద్ద సాహసమే..!
మెగా స్టార్ చిరంజీవి అంటే ఎందరికో స్ఫూర్తి. అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగి మెగా స్టార్ అంతటి స్థాయికి ఎదిగాడంటే మాములు విషయం కాదు. అందుకే ఆయన్ను ఎంతో మంది హీరోలు స్ఫూర్తి గా తీసుకుంటారు. ఇక మెగాస్టార్ తర్వాత మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు గా వచ్చారు. చిరు, పవన్, నాగబాబు, చరణ్, వరుణ్, సాయి తేజ్, నిహారిక, ఇప్పుడు వైష్ణవ్ తేజ్, ఆఖరికి చిరు అల్లుడు కూడా తెలుగు తెరపై సందడి చేస్తున్నారు.

చిరు, వెంకీ అయిపోయింది.. ఇప్పుడు నాగ్, బాలయ్య వంతు..!
మొత్తానికి సందీప్ వంగా మొదలు పెట్టిన 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచు. ఈ డైరెక్టర్ ఏం చేసినా అది సెన్సేషనే అన్నట్టు ఇప్పుడు ఈ ఛాలెంజ్ కూడా బాగా పాపులర్ అయిపోతుంది. మన స్టార్ హీరోలందరూ ఇంటి పనులు చేయడం.. గరిటె పట్టుకొని వంటలు కూడా చేయడం చేస్తున్నారు ఈ ఛాలెంజ్ వల్ల. సందీప్ మొదట రాజమౌళిని చాలెంజ్ చేయగా రాజమౌళి కీరవాణి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లను చాలెంజ్ చేశాడు. అలా ఈ ఛాలెంజ్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య ఆసక్తికరంగా మారుతుంది.
తమ్ముడు ఫైనల్లీ తల ఏత్తుకునేలా చేశావ్..!
మొత్తానికి మెగా ప్రిన్స్ వరుణ్ ను తల ఎత్తుకునేలా చేశాడట పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా. అంతలా అకీరా ఏం చేశాడానా... ఏం లేదులెండి.. తన తమ్ముడిపై కామెడీ చేశాడు వరుణ్. ఈ రోజు అకీరా పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అందరూ విషెస్ చెప్పారు. మెగా ఫ్యామిలీ కూడా తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక వరుణ్ కూడా తన విషెస్ కూడా తెలియచేశాడు అకీరాకి. అయితే కాస్త కామెడీ చేశాడు. హ్యాపీ బర్త్ డే తమ్ముడు.. ఫైనల్లీ నన్ను తల ఎత్తుకునేలా చేసావు.. విష్ యూ ఏ గ్రేట్ ఇయర్ అని ట్వీట్ చేసాడు. మరి మెగా ఫ్యామిలీ లో అందరి కంటే వరుణ్ తేజ్ ఒక్కడే 6 అడుగులు ఉంటాడు. ఇక అకీరా వరుణ్ ను మించిపోయాడు.
వరుణ్ తేజ్ 'బాక్సర్' రిలీజ్ అయ్యేది అప్పుడే...!
నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా... కరోనా వల్ల ప్రస్తుతానికి షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాను జూలై 30వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారట చిత్రయూనిట్. లాక్ డౌన్ అయిపోయిన తర్వాత గ్యాప్ లేకుండా షూటింగ్ జరిపి జూలై 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారట. చూద్దాం మరి ఏం జరుగుతుందో...

మరోసారి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జోడీ?
‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాలలో జంటగా నటించి అలరించారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి. కాగా, ఈ ఇద్దరు ముచ్చటగా మూడోసారి జట్టుకట్టనున్నట్టు సమాచారం.

ఏప్రిల్ 3 నుంచి `వరుణ్ తేజ్ 10`... సెకండ్ షెడ్యూల్
`ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్` చిత్రాల విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వరుణ్... బాక్సర్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. కాగా, ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయింది. వైజాగ్ లో 15 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో వరుణ్, కథానాయిక సయీ మంజ్రేకర్, నదియా, నవీన్ చంద్ర తదితరులపై మేజర్ సీక్వెన్స్ షూట్ చేశారు.
`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ డేట్ టార్గెట్ గా వరుణ్, నితిన్ చిత్రాలు?
`భీష్మ` ఘనవిజయం యువ కథానాయకుడు నితిన్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒకవైపు ఆ సక్సెస్ ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు `రంగ్ దే`, `చెక్` చిత్రాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు నితిన్. కాగా, వీటిలో `రంగ్ దే`నే ముందుగా తెరపైకి రానుంది. `తొలి ప్రేమ` ఫేమ్ వెంకీ అట్లూరి రూపొందిస్తున్న `రంగ్ దే`లో నితిన్ కి జోడీగా `మహానటి` కీర్తి సురేష్ నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.