`భీష్మ` ఘనవిజయం యువ కథానాయకుడు నితిన్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒకవైపు ఆ సక్సెస్ ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు `రంగ్ దే`, `చెక్` చిత్రాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు నితిన్. కాగా, వీటిలో `రంగ్ దే`నే ముందుగా తెరపైకి రానుంది. `తొలి ప్రేమ` ఫేమ్ వెంకీ అట్లూరి రూపొందిస్తున్న `రంగ్ దే`లో నితిన్ కి జోడీగా `మహానటి` కీర్తి సురేష్ నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే… ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అదే రోజున మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే కథనాలు వస్తున్నాయి. సో… `ఆర్ ఆర్ ఆర్` ప్రీవియస్ రిలీజ్ డేట్ జూలై 30 (ఇప్పుడు జనవరి 8 విడుదల తేదీ)కి వస్తున్న వరుణ్, నితిన్… ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.



అన్నట్టు.. వరుణ్ గత చిత్రం `గద్దలకొండ గణేష్`లో నితిన్ అతిథి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























