`ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్` చిత్రాల విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వరుణ్… బాక్సర్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. కాగా, ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయింది. వైజాగ్ లో 15 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో వరుణ్, కథానాయిక సయీ మంజ్రేకర్, నదియా, నవీన్ చంద్ర తదితరులపై మేజర్ సీక్వెన్స్ షూట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మలి దశ చిత్రీకరణని ఈ నెల 3 నుండి ప్రారంభించనున్నారు. అంతేకాదు.. సినిమా పూర్తయ్యేవరకు ఈ షెడ్యూల్ సాగుతుందని చిత్ర బృందం ప్రకటించింది. అలాగే జూలై 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. `బాక్సర్` అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ స్పోర్ట్స్ డ్రామాకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ బాణీలు అందిస్తున్నాడు.
అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్, సిద్ధు ముద్ద ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: