‘ఎఫ్ 3’ గ్రాండ్ లాంచ్

Anil Ravipudi, Anil Ravipudi Directorial F3, Director Anil Ravipudi, F2 Movie Sequel, F2 Sequel, F3, F3 Film, F3 Movie, F3 Movie Finally Launched And Shooting, F3 Movie Finally Launched And Shooting To Commence, F3 Movie Latest Reports, F3 Movie Telugu, F3 Telugu Movie, F3 Telugu Movie Updates, latest telugu movies news, Latest Tollywood News, mehreen pirzada, Tamannaah, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Varun Tej, venkatesh daggubati

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్2’. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఎఫ్ 3 చిత్రానికి సంబంధించి కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. సినిమా రెగ్యులర్ షూటింగును 23 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇందులో వెంకీ, వ‌రుణ్‌తో పాటు మ‌రో హీరో కూడా న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్పటీకే రవితేజ పేరు వినిపిస్తుంది.

కాగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక F2 లో నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =