వలస కూలీల పై హరీష్ శంకర్ ఆవేదన..!

Gaddalakonda Ganesh Movie Director Harish Shankar Express His Sympathy For Migrant Workers Through An Emotional Tweet On Twitter

కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేదలకు.. రోజు కూలీలు చేసే వారికి సాయం చేస్తూనే వున్నారు. అంతేకాదు పలువురు సినీ, రాజకీయ, క్రీడా కారులు ఇలా చాలా మంది పెద్ద ఎత్తున విరాళాలు చేశారు. సెలబ్రిటీస్ మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉంది. అందరికీ ఏదో ఒకవిధంగా సాయం అందుతూనే వుంది. కానీ వలస కార్మికుల పరిస్థితి మాత్రం వేరు. వారికి బాధ మాత్రం దయనీయం. లాక్ డౌన్ విధించిన వెంటనే చావైనా, బతుకైనా అనుకుని కాలిబాటన వందల, వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వారి సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇక వీరి దయనీయ పరిస్థితిపై టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించి భావోద్వేగం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన ఆవేదనను ఒక కవిత రూపంలో రాసుకొచ్చాడు. “బండరాళ్లను పిండి చేసిన చేతులు డొక్క నొప్పికి లొంగిపోయాయి”, “పెద్ద పెద్ద ఇనుప చువ్వలను వంచిన వేళ్లు మెత్తని పేగుల ముందు ఓడిపోయాయి”… మేం వేసిన రోడ్లే మమ్మల్ని వెక్కిరిస్తుంటే.. బతకడం కోసం ఊరొదిలొచ్చిన మేము చచ్చేలోపు ఊరెళ్తే చాలనుకుంటూ ఆకలి అడుగులతో.. పేగుల అరుపులతో.. కాళ్ళూ, కడుపు ఒకేసారి కాలుతుంటే..మమ్మల్ని చూసే లోకులకు బాధేస్తోంది, జాలేస్తోంది… కానీ మాకు మాత్రం ఆకలేస్తోంది” అంటూ హరీశ్ శంకర్ తన ట్విట్టర్ పోస్టులో భావోద్వేగంతో ఒక ట్వీట్ చేశారు.


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 11 =