మొత్తానికి సందీప్ వంగా మొదలు పెట్టిన ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచు. ఈ డైరెక్టర్ ఏం చేసినా అది సెన్సేషనే అన్నట్టు ఇప్పుడు ఈ ఛాలెంజ్ కూడా బాగా పాపులర్ అయిపోతుంది. మన స్టార్ హీరోలందరూ ఇంటి పనులు చేయడం.. గరిటె పట్టుకొని వంటలు కూడా చేయడం చేస్తున్నారు ఈ ఛాలెంజ్ వల్ల. సందీప్ మొదట రాజమౌళిని చాలెంజ్ చేయగా రాజమౌళి కీరవాణి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లను చాలెంజ్ చేశాడు. అలా ఈ ఛాలెంజ్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య ఆసక్తికరంగా మారుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ ఛాలెంజ్ ను పలువురు పూర్తి చేయగా తాజాగా మెగాస్టార్, వెంకీ కూడా పూర్తి చేశారు. చిరంజీవి నేడు ఆ ఛాలెంజ్ పూర్తి చేసి వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. `నేను రోజు చేసే పనులే…ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం` అంటూ తాను ఇల్లు క్లీన్ చేస్తూ అలాగే తన తల్లికి దోసెలు కూడా వేసి పెడుతున్న వీడియోను షేర్ చేశాడు. ఇకచిరు ఈ ఛాలెంజ్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ గారికి, తన మిత్రుడు రజినీకాంత్ కి విసిరారు.
Here it is Bheem @tarak9999 నేను రోజు చేసే పనులే…ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం. And I now nominate @KTRTRS & my friend @rajinikanth #BeTheRealMan challenge. pic.twitter.com/y6DCQfWMMm
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 23, 2020
ఇక విక్టరీ వెంకటేష్ కూడా ‘బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్’ ను స్వీకరించాడు. ఇల్లు ఊడ్చి, ట్రిమ్మింగ్ చేశాడు. వంట కూడా చేసాడు. ఆయన ఈ వీడియోని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ ఛాలెంజ్ ను చిన్నోడు మహేష్, కోబ్రా వరుణ్ ఇంకా అనిల్ రావిపూడి కు విసురుతున్నట్టు తెలిపారు.
Here’s my video @tarak9999.
Let’s help our family with domestic work and #BetheREALMAN
I request our Chinnodu @UrsTrulyMahesh, my cobra @IAmVarunTej & @AnilRavipudi to pass it on. pic.twitter.com/ILeH3Cm0Xq
— Venkatesh Daggubati (@VenkyMama) April 23, 2020
మరి ఇప్పటి వరకూ అందరూ ఈ ఛాలెంజ్ ను స్వీకరించి ‘రియల్ మ్యాన్’ అనిపించుకున్నారు. ఇక చిరు, వెంకీ వంతు అయిపోయింది.. ఇప్పుడు నాగ్, బాలయ్య వంతు మిగిలింది. వీరి వీడియోస్ కోసం ఎదురుచూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: