తమ్ముడు ఫైనల్లీ తల ఏత్తుకునేలా చేశావ్..!

Varun Tej Funny Tweet About Akira Nandan
Varun Tej Funny Tweet About Akira Nandan

మొత్తానికి మెగా ప్రిన్స్ వరుణ్ ను తల ఎత్తుకునేలా చేశాడట పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా. అంతలా అకీరా ఏం చేశాడానా… ఏం లేదులెండి.. తన తమ్ముడిపై కామెడీ చేశాడు వరుణ్. ఈ రోజు అకీరా పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అందరూ విషెస్ చెప్పారు. మెగా ఫ్యామిలీ కూడా తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక వరుణ్ కూడా తన విషెస్ కూడా తెలియచేశాడు అకీరాకి. అయితే కాస్త కామెడీ చేశాడు. హ్యాపీ బర్త్ డే తమ్ముడు.. ఫైనల్లీ నన్ను తల ఎత్తుకునేలా చేసావు.. విష్ యూ ఏ గ్రేట్ ఇయర్ అని ట్వీట్ చేసాడు. మరి మెగా ఫ్యామిలీ లో అందరి కంటే వరుణ్ తేజ్ ఒక్కడే 6 అడుగులు ఉంటాడు. ఇక అకీరా వరుణ్ ను మించిపోయాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా… కరోనా వల్ల ప్రస్తుతానికి షూటింగ్ కు బ్రేక్ పడింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =