డెస్టినేషన్ వెడ్డింగ్ – పెళ్లి పనుల్లో వరుణ్ బిజీ

Varun Tej Got Busy In Niharika Konidela Destination Wedding Works Says Actor Naga Babu

త్వరలోనే మెగా డాటర్ నిహారిక పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్యతో ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది కూడా. ఇక కొద్దిరోజుల్లో బ్యాచిల‌ర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్ప‌నున్న నేప‌థ్యంలో నిహారిక బ్యాచిల‌ర్ పార్టీ కూడా జరుపుకుంది. ఇక ఈ నేపథ్యంలో తన కూతురి పెళ్లి గురించి.. పనులు గురించి చెపుతూ చెపుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక ఛానల్ తో ఇంటరాక్ట్ అయిన నాగబాబు.. నిహారిక పెళ్లి జరుగుతుండటంతో మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం…పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడు.. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాం..డిసెంబర్ లో పెళ్లి ఉంటుందని తెలిపారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే వరుణ్ తేజ్ కొన్ని ప్లేసెస్ ను సెలెక్ట్ చేసి లిస్ట్ తయారు చేసాడు.. పెళ్లి పనుల్లో వరుణ్ బిజీ గా ఉన్నాడు.. వివాహం జరిగే తేదీని త్వరలోనే అందరికీ తెలియజేస్తామని అన్నారు.

నిహారిక , చైత‌న్య‌ల‌కు ఆగ‌స్ట్ 13న నిశ్చితార్దం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌కు చిరంజీవి-సురేఖ‌, రామ్ చ‌ర‌ణ్ -ఉపాస‌న‌, అల్లు అర్జున్-స్నేహా రెడ్డిల‌తో పాటు సాయిధ‌ర‌మ్ తేజ్, ప‌లువురు కుటుంబ స‌భ్యులు హాజ‌ర‌య్యారు.

ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన మెగా హీరోయిన్ నిహారిక ఆసినిమాలో తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, సూర్య‌కాంతం, సైరా న‌ర‌సింహా రెడ్డి చిత్రాల‌లో న‌టించింది. నిహా న‌టించిన త‌మిళ సినిమా ఒక‌టి విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 6 =